ఈ పసి శిశువులు, పశువుల కసి శిశువులు :'( :'(


****ఈ పసి శిశువులు, పశువుల కసి శిశువులు ****.నరరూప రాక్షసుల నరమేధం...
పసిప్రాణాలకి పిండ దానం ...

కనలేని కన్నతల్లి కడుపుకు బరువు వీళ్ళు ...
కానరాని కన్నోళ్ళ కఠిన చర్యల ఫలితం వీళ్ళు ....

దు:ఖాలయం అశాశ్వతం అని ముందే ఎరిగిన పసిజ్ఞానులు వీళ్ళు ...
పేగు భందాలకు నీళ్లోదులుతున్న ఈ లోకంలో అడుగిడలేని పుణ్యాత్ములు వీళ్ళు ....

ఆరని ఆక్రోశాలకు, వీడని వేధింపులకు , కోర్కెల సాధింపునకు ఫలితం వీళ్ళు ...
నేరవేరని ఆశయాలకు , కర్కశత్వపు కౌగిళ్ళకు , కొందరి దౌర్జన్యాలకు దారుణం వీళ్ళు......

అందుకే ఆశలు మొదలవక ముందే అసువులు బాసారు..
ప్రాణం పోసుకుంటూనే పాశవిక చర్యలకు బలులయ్యారు...

తల్లి గర్భకుహరానికే అలకరణలు వీళ్ళు ...
కానీ నేడు కుప్పతొట్లకే నిర్జీవ కళ అయ్యారు...

ఎందుకు అసలెదుంకు ఈ దారుణానికి ఒడిగట్టడం???
పసి తనువుల ప్రాణాలను తీయడం .. పసి మొగ్గల బతుకులు చిదమడం...???

చిన్ననాటి నుండీ
“అన్నదానం మహా దానం “రక్త దానం మహా దానం “విద్యాదానం మహా దానం “
ఇలా వింటూ పెరిగాం మనం

కానీ నేటి దుస్థితి , ఇంతటి అమానుష పరిస్థితి చూస్తుంటే
“గర్భాదానం మహా దానం “గర్భస్థ శిశువుల దానం మహా దానం “
అనిపింప చేసేలా సాగుతోంది ఈ వ్యవహారం..

పాశవిక , పైశాచిక దుర్మార్గపు అమానవీయ వ్యవహారం

ఆపలేరా??? ఈ దుశ్చర్యలను రూపుమాపలేరా???

పొట్టన బెట్టుకోవాల్సి౦ది పోయి(కడుపున  పెట్టుకుని  కాచుకోవాల్సింది  పోయి ) పొట్టన బెట్టుకు౦టున్నారు
కనాల్సింది పోయి కడతేరుస్తున్నారు..
కనకుండానే కుప్ప తొట్టికంకిత౦ చేస్తున్నారు
ఆపలేరా??? ఈ దుశ్చర్యలను రూపుమాపలేరా???
పెంచే ఉద్దేశముంటేనే కనండి "ఈనాడు 31-dec-2012"
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment