ఏమిటో ఈ రోజు అన్నీ బాల్య స్మృతులే గుర్తుకొస్తున్నాయి


ఎమైపోయిందో ఆ అమాయకత్వం
ఎమయ్యాయో ఆ స్వార్ధం లేని అలోచనలు
ఎటెళ్ళిపోయాయో ఆనాటి బాల్యపు విహంగాలు
ఎమో ఎవ్వరికెరుక..అడిగినవారెవ్వరు కనుక!
ఆ పసిడి కానుతులీనే భానుడి ఉదయరాగంతో
మొదలు బాల్యపు ఆటాపాటల హడావిడి
ఆడుతూ పాడుతూ అమ్మ చెప్పినట్టు
పళ్ళుతోమటం,పెట్టింది తినడం
గాలికి దిశలేనట్టు మా కాలికి కూడా
ఎటుపడితే అటు తిరుగుతూ..
కల్లు గీచే రామయ్య తాత గంటల చప్పుడుకు
ఆయన వెంట పరుగెట్టిన ఆకు తాత చెప్పే
కథలు వినటం ఎంతో సంతోషం..
పొలంగట్లపై ఆటలు
చెట్టు కొమ్మకు కట్టిన ఉయ్యాల
ఉయ్యాలలో వంతుల వారీగా ఊగుతూ
గాలిలో తేలూతూ కేకలు వేయటం..
చెరువు గట్టున కట్టేసిన మేకపిల్లలని
తాడు విప్పి వాటి వెనుక పరుగెత్తడం
మా అల్లరి చూసి మా వెంట పడి
అబ్బబ్బా పిల్లలూ ఏమి అల్లరిరా
అంటూ కేకలు వేసే సాంబయ్య తాత..
తోటలో దూరి దాగుడుమూతలూ
రామ చిలుక కొట్టిన పళ్ళు ఏరుకుని
తినటం,పరుగు పందాలూ..వొంగు దూకుళ్ళూ
ఆడుతూ సమయాన్ని మరవటం..
మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళతో
ఇళ్ళకు చేరటం ..మాసిన బట్టలు చూసి
ఇంటిల్లపాదీ కేకలు వేయటం..
కడుపునిండా తినటం తోటలో
బొమ్మల పెళ్ళిళ్ళు చేయటం
పెళ్ళి కూతురి చీరకోసం నానమ్మ చీర చిపటం
ఎవరర్రా అని అడిగితే ...
ఒకరి మొహం ఒకరు చూసుకోవటం
పట్టుపడిన నేను నానమ్మకు
దొరకకుండా తతగారి పంచన చేరటం
పదిమందిలో కుర్చున్న తాతగారి వద్దకు రాలేక
చేతులు చూపిస్తూ నానమ్మ తిట్టడం
ముసిముసి నవ్వుల మధ్య మా ఇద్దర్నీ చూసే
తాతగారు..ఎన్నో ఎన్నెన్నో..
ఆస్తమా ఉందని చేప మందు వేయాలని
తెప్పించటం చూసిన నేను
ఎవ్వరికీ దొరక్కుండా పక్క తాత గారి తోటలో
రేగు చెట్టెక్కి కూర్చోవటం
పళ్ళన్నీ తిని గింజలన్నీ
మూటకట్టి తెచ్చుకున్న జ్ఞాపకం ఇంకా పదిలమే..
ఏమిటో ఈ రోజు అన్నీ బాల్య స్మృతులే గుర్తుకొస్తున్నాయి
మీరూ వెళ్ళండలా ఓ సారి మీ స్మృతులలోకి..@తులసి..

Source : https://www.facebook.com/madhu.chowdary 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment