గురుకులంలో గురువు పాఠాలు చెప్తున్నాడు. మధ్యలో ఒక శిష్యుడికి ఒక సందేహం వచ్చింది. అతడు లేచి గురువు గారిని అడిగాడు.
"గురువు గారు దేవుడు ఎక్కడో మనకు కనిపించకుండా ఉండటం ఎందుకు మనతోనే ఉండొచ్చు కదా" దానికి గురువు గారు చెప్తా కానీ ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు అన్నాడు. దానికి శిష్యుడు అడగండి గురువు గారు అన్నాడు.
" మీ ఇంటికి మన మహారాజు గారు వస్తే ఏం చేస్తావ్"
"ఆయన్ని ఘనంగా సత్కరిస్తా, ఇంటిల్లిపాదిమి ఎంతో సంతోషిస్తాం"
"ఒక పదిసార్లు వస్తే" మళ్లీ అడిగాడు గురువు గారు
"రాజు గారికి మా మీద ఉన్న ప్రేమకు ఆనందిస్తాం, తోచినవిధంగా సత్కరిస్తాం"
"అదే ప్రతి రోజు రాజు గారు మీ ఇంటికి వచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావ్" గురువు గారు మళ్లీ ప్రశ్నించారు.
శిష్యుడు కొంచెం అసహనంగా " ఈయనకు పనేమీ లేదా రోజు వచ్చి విసిగిస్తున్నాడు అనుకుంటాం. ఎలాగూ రోజూ వచ్చే వాడే కదా అని సత్కారాలు అలా ఏమీ చేయము"
గురువు గారు అన్నాడు ఒకప్రాంతాన్ని ఏలే రాజుకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మొత్తం ప్రపంచాన్ని ఏలే దేవుడు రోజు కనిపించి మనతో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో. దేవుడికి తను సృష్టించిన మనిషి స్వభావం తెలుసు కాబట్టే మనిషికి దూరంగా ప్రశాంతంగా ఉంటున్నాడు. మనకు ఏది, ఎప్పుడు, ఎలా కావాలో అలా ఇస్తాడు తప్ప మనకు కనిపించి తన విలువ తగ్గించుకోడు.
SanthoshKumar Sharma Gollapelli

0 comments :
Post a Comment