ఎందుకో ఆ మౌనం........

ఎందుకో ఆ మౌనం........
గుర్తుందో లేదో
మనసు మనసుతో మాట్లాడి చాల రోజులైంది
అంత పంచలేని బాధా నీది
ఓదార్చలేని మనసా నాది
దూరం దగ్గరే అయినా మౌనంతో స్నేహం చేసి
మనసుని మరింత దూరం పెడుతున్నావ్

ఏం చేద్దామని
ప్రతిరోజు మాట్లాడే మాట ఒక్కసారి మూగబోతే
నన్ను పలకరించే ఆ కళ్ళు చీకటిని కమ్మేస్తే
జీవించి నేను
జీవంగా లేని నన్ను
చుట్టూ ప్రపంచం పిచ్చోడంటోంది
వాళ్ళకేం తెలుసు
నీ మనసుతో మాట్లాడే మాటలు
మనవైన జ్ఞాపకాలు
మనసు రాజీపడలేని చోట ఓదార్పు తోడవుతుంది
ఒంటరితనాన్ని దూరం చేస్తుంది
ఆ ఓదార్పు నీవే
ఆ తోడూ నీవే
తెలిసి ఎన్నాళ్లీ దూరం
మనసు మోయలేని భారం
నాలో నేనే నీ ఊహల్లో విహరిస్తూ క్షణ క్షణం ........@ బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment