ఎవరేం అనుకుంటే మనకేంటి?

ఎవరేం అనుకుంటే మనకేంటి?
__________________

"ఫలానా పని చేస్తే అందరేం అనుకుంటారో..." చేసే ప్రతీ పనికీ ఫస్ట్ మనం ఆలోచించేది ఇది!

సొసైటీ గురించి ఆలోచించాలి.. ఎంతవరకూ అంటే సొసైటీ పట్ల మన బాధ్యతలు నెరవేర్చే వరకూ, సొసైటీలోని ఇతర వ్యక్తులకు హాని చెయ్యకుండా మన నడవడిక మార్చుకునే వరకూ!

సొసైటీ గురించి అస్సలు పట్టించుకోకూడదు.. ఎప్పుడంటే మన వ్యక్తిగత ఇష్టాఇష్టాలూ, అభిరుచులూ ఆస్వాదించేటప్పుడు! ఏ తప్పూ చెయ్యనంత వరకూ మనం ఏ పనైనా చేయొచ్చు దర్జాగా!!

చూసిన వాళ్లూ, అనుకునే వాళ్లూ వంద రకాలు అనుకుంటారు. అనుకోనీయండి.. మన మనస్థత్వం దగ్గరగా తెలీని వాళ్లూ, అస్సలు మనమేంటో తెలీని వాళ్లూ ఏదేదో అనేసుకుంటారు అని సరదాలు కూడా భయపడుతూ చంపేసుకుంటే ఎలా?

సొసైటీని మన జీవితంలో ఎంతవరకూ తీసుకోవాలి అనే విషయంపై ఎప్పటి నుండో రాద్దాం అనుకుంటూ ఉన్నా గానీ ఇప్పటికిప్పుడు ఉన్న ఫళాన రాయడానికి కారణం ఉంది.

నేను నిన్న షటిల్ ఆడే వీడియో పెట్టాను... "ప్రొఫెషనల్స్ ఇలాంటి పర్సనల్ వీడియోలు పబ్లిక్‌గా షేర్ చేసుకోవడం బాగుండదేమో.. ఒక్కసారి ఆలోచించండి" అన్నట్లు మంచిగానే ఒకరు సలహా ఇచ్చారు. తప్పేం లేదు వాళ్లు అన్న దానిలో! అంతకుముందు కూడా ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది మిత్రులు "మిమ్మల్ని టెక్నికల్ గురు గానే మేం భావిస్తూ ఉన్నాం. మీరు అలాంటివి పోస్ట్ చేస్తేనే బాగుంటుంది" అని సుతిమెత్తగా చెప్తూ వచ్చారు కరెక్టే!

-------------

అందరు చెప్పేదీ కరెక్టే. అలాగే నేను చేసేదీ కరెక్టే. Becoz నా చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసిన పెద్ద శత్రువు ఎవరు అంటే సొసైటీ! సో సొసైటీని ఎప్పుడు ఎక్కడ ఎలా మనస్సులోకి తీసుకోవాలో నాకు తెలుసు.

నేను సొసైటీని అసహ్యించుకోను... మనుషులకు దూరంగా ఉండను... అందర్నీ ప్రేమిస్తాను, అభిమానిస్తాను, సొసైటీ పట్ల బాధ్యతగా ఉంటాను.

అలాగే సొసైటీ గురించి నా ఇష్టా ఇష్టాలు చంపుకోను. నా ఇష్టాఇష్టాలు సొసైటీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హాని చేసేవై ఉంటే మార్చుకుంటాను.

---------------

ఇకపోతే ఓ strong point అందరూ చెప్పేది.. ఒక ప్రొఫెషనల్ ఒక ప్రొఫెషనల్‌గానే ప్రవర్తించాలని!!

అలా చేయబట్టే అందరూ 50 ఏళ్లకే ముసలివాళ్లైపోతున్నారు. సంతోషంగా గడపడం చేతకాదు, నవ్వడానికీ చాలా కాలిక్యులేషన్లు కావాలి, పక్క మనిషికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ, సరదాగా ఆడుకోవడానికీ, జోక్లు వేసుకోవడానికీ, లైఫ్‌ని నచ్చనట్లు బ్రతకడానికీ చాలా సంకోచాలు. ప్రొఫెషనల్ ఛట్రంలో జీవితాల్ని సమాధి చేసుకుంటున్న వాళ్లు కోకొల్లలు.

కరెక్టే.. ప్రొఫెషనల్ ప్రొఫెషనల్‌లాగే ఉండాలి... చేసే ప్రొఫెషన్ వరకూ! అంతే గానీ ప్రతీ క్షణం తానొక ప్రొఫెషనల్‌ననే ఫీలింగ్ మోసుకు తిరగ్గూడదు. అందరి దగ్గరా గొప్ప కోసం చిన్న చిన్న సరదాల్ని కూడా వదిలేసుకుని ప్రొఫెషనల్స్‌గా చలామణి అయ్యే వాళ్లు ఎంత సంతోషం మిస్ అవుతున్నారో ఆలోచించండి.

-----------

నేను నమ్మేదీ, పాటించేదీ, అందరికీ చెప్పేదీ ఒక్కటే.. సొసైటీ గురించి ఆలోచించవలసినంత వరకే ఆలోచించండి.. సొసైటీకి మీరేమైనా చెయ్యగలిగితే నిస్వార్థంగా చేయండి.. అంతే తప్పించి సొసైటీలోని మనుషుల ఓపీనియన్ పోల్స్‌ని మైండ్‌లోకి తీసుకుని మీరు ఓ ఇరుకు ఛట్రంలో కూరుక్కుపోకండి. అది మీ జీవితాన్ని చాలా నరకంగా మారుస్తుంది.

చివరిగా ఒక్క మాట.. ఇది నన్ను ఆత్మీయునిగా భావించి సలహా ఇచ్చిన.. ఇస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగానో, కోపంగానో రాస్తున్నది కాదు.. చాలా రోజుల నుండి అన్పిస్తోంది... జనాలు ఎందుకు ఇలా ఇరుక్కుపోయి బ్రతికేస్తారు సొసైటీ గుర్తొస్తే అని!

నాకు తెలుసు "సొసైటీ బంధనాలు తెంచుకుంటే స్వేచ్ఛాజీవులం" అని! అనవసరమైన విషయాల్లో మనుషుల్ని అతి తక్కువ పట్టించుకోవడం నా చిన్నప్పటి నుండి నాకు అలవాటు. నా హాపీనెస్‌కి కారణం అదే!! ఈ సీక్రెట్ ఇతరులకూ చెప్పాలనే ఇది రాశాను.

చివరిగా నా వరకూ నేను ఓ ప్రొఫెషనల్ గా ఉండాలనుకోను.. ఓ పరిపూర్ణ మనిషిలా ఉండాలనుకుంటాను!!

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్

Sridhar Nallamothu
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment