Nothing is more than "Quality of Life".

Nothing is more than "Quality of Life". క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నిరంతరం సంతృప్తి కోసం వెంపర్లాడడం కాదు.. సంతృప్తిని ఉన్న ఫళంగా ఫీలవడం!!

కొంతమందికి విచారంగా బ్రతకడానికి పాపం కొన్ని కారణాలుంటాయి. వాళ్లని పక్కనపెట్టొచ్చు.. కానీ మనలో 90% మందికి ఏ కారణమూ ఉండదు.. ఖాళీగా ఉన్న బ్రెయిన్‌లో అడ్డమైన బయటి ప్రపంచంలో కన్పించే చెత్తనంతా తోసేసి అభద్రత ఫీలవడం తప్పించి!

విచారానికి మనం భలే అలవాటుపడిపోయాం.. నిరంతరం ఏదో ఒకటి దీర్ఘంగా ఆలోచించకపోతే మనకు పిచ్చెక్కిపోతుంది. జీవితం నిలిచిపోయినట్లు అన్పిస్తుంది. చాలా కష్టాలూ, బాధలూ ఊహించుకుని బ్రతికేస్తే గానీ మనకు మోటివేషన్ రాదు, మన మీద సింపతీ కలగదూ, ఆ సింపతీ ద్వారా ఇగో శాటిస్‌ఫై అవదూ!

----------------

ఎంత హాపీగా నవ్వొచ్చు చెప్పండి.. ఎందుకు నవ్వలేకపోతున్నాం? అయినా నవ్వితే సొమ్మేం పోతుంది.. ఒక్కసారి మనసారా నవ్వితే శరీరం అంతా ఎంత తేలికవుతోందో స్వయంగా ఆనుభవించండి.. కానీ మొహం ముడుచుకుని కూర్చోవడం అలవాటైపోయి హాయిగా నవ్వడానికీ కారణాలు వెదుక్కుంటున్నాం.

హాయిగా, హాపీగా ఉండొచ్చు.. ప్రయత్నిస్తే.. నోనో ఎలాంటి ప్రయత్నమూ చేయకుండానే, ఎలాంటి కండిషన్లూ లేకుండానే!!

- నల్లమోతు శ్రీధర్

Sridhar Nallamothu
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment