ఫోన్లలో Health మోనిటరింగ్ ముఖ్యమైనది కాబోతోంది..

ఫోన్లలో Health మోనిటరింగ్ ముఖ్యమైనది కాబోతోంది..
"ఫోన్లలో కొత్తగా ఏం ఫీచర్లు వస్తాయి.. అన్నీ వచ్చేశాయి కదా" అని భావించే వారు ఇటీవల flagship ఫోన్లయిన iPhone 6 Plus, Samsung Note 4లలో హెల్త్ మోనిటరింగ్ సదుపాయాలు చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.
గతంలో heart rateని తెలుసుకునే ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి ఓ వీడియో డెమో చేశాను. ఈ లింకులో దాన్ని చూడొచ్చు. https://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E అయితే అది కేవలం ఓ రఫ్ ఐడియాని ఇచ్చే మామూలు అప్లికేషనే.
కానీ ఇప్పుడు మన శరీరంలో stress level, heart rate, బ్లడ్ లో ఆక్సిజెన్ సరిపడా ఉందా లేదా అన్నదీ, వాతావరణంలో UV కిరణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్నదీ అన్నీ టెస్ట్ చేసుకునేలా Samsung Note 4లో డెడికేటెడ్ సెన్సార్లు పొందుపరచబడ్డాయి. వాటిలో కొన్ని ఫీచర్ల ఫలితాలు ఈ ఫొటోలో చూడొచ్చు.
నేను చాలా పని వత్తిడిలో ఉంటాను కాబట్టి stress level సహజంగానే ఎక్కువ ఉంది. మిగతా వివరాలూ చూడొచ్చు.
మొత్తానికి టెక్నాలజీ వల్ల ఆరోగ్యాలు చెడగొట్టుకుని.. అదే టెక్నాలజీ ద్వారా ఆరోగ్యం ఎలా ఉందో మోనిటర్ చేసుకునే రోజులకు వచ్చేశాం అన్నమాట..
- నల్లమోతు శ్రీధర్

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment