ఓ మనసు తెరలు తెరలుగా నవ్వుతోంది..

ఓ మనసు తెరలు తెరలుగా నవ్వుతోంది..
గెలిచానన్న అహంతో కాబోలు!

............................................
మనసు-మమత మధ్యన
గెలుపోటముల యుద్ధమట

నవ్వి నవ్వి అలసిన మనసు
నాకేమిటని నిదరోయింది
చూసి చూసి అలవాటయ్యిందేమో
మౌనమే తానయ్యిందా మమత
పాపం ఎంత అలసిందో అని ప్రేమారా
నెమిరిందా మమత ఓ పలకరింపుతో..
ఉన్నావా అంటూ అహం నిండిన పిలుపుతో
పిలిచిందా మనసు..మమత మౌనమే జవాబయ్యిందప్పుడు
అహంతో కూడిన హుంకారం మనసు నుండి ప్రతిస్పందన
తెలిసినా తెలియనట్టే మిన్నకుండిపోయిందా మమత
తానుగా లొంగి వెళ్ళటం మమత లక్షణం
అన్నీ తనే అని మనసు గాంభీర్యం
విజయోత్సాహమేమో ఎగిరెగిరి పడుతోంది మనసు
ఎగిరిన ప్రతిసారీ దెబ్బతగులుతుందేమో అని మమత వాత్సల్యం
నిర్లక్ష్యం తన నేస్తం కదా ఇప్పుడు
ఎగిరిన ప్రతిసారీ మమత పరుచుకుంది తనని తాను కిందుగా
మనసు అహానికి గెలుపో
మమత సహనానికి అలుపో
పోరాటం ఏనాడో ప్రారంభం
ముగిసే వేడుకకి ఎవ్వరో ఒక్కరే సాక్ష్యం
అహం మాటున పెరిగిన కోపద్వేషాగ్నిలో
మమత కాలుతూ జాడనే కోల్పోయిందేనాడో
తనలో లేని తనతో యుద్ధం
గెలిచిన మనసుకు అభినందనీయం
అహమో గెలుపో తెలిసిన వారెవ్వరూ లేరిక్కడ
గెలిచిన వారిదే రాజ్యమెప్పుడయినా@తులసి....
Read More at : https://www.facebook.com/madhu.chowdary.96199?fref=nf 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment