నువ్వూ-నేను చెరో దిక్కుకి చేరిపోయాక
చేదనిపించని క్షణాలెన్ని అంటే లెక్క చెప్పడం కష్టం...
ఏ జన్మకో కలిసినప్పుడు
"బాగున్నావా" అంటే... "ఉన్నాను" ,
అని మాత్రమే ఒకరితో ఒకరం చెప్పుకోగలం..
అంతేగా?
చేదనిపించని క్షణాలెన్ని అంటే లెక్క చెప్పడం కష్టం...
ఏ జన్మకో కలిసినప్పుడు
"బాగున్నావా" అంటే... "ఉన్నాను" ,
అని మాత్రమే ఒకరితో ఒకరం చెప్పుకోగలం..
అంతేగా?
పరవాలేదులే,
ఏడవగలిగినవాడే... ఏడిపించగలడు కూడా..
అన్న నిజం ఇద్దరికీ తెలిసిందేగా...!!
ప్రాణం లేని శిలలమై
కాల ప్రవాహంలో శిధిలమై
ఏ చరిత్రకారుడూ ఎప్పటికీ పోల్చుకోలేని
ఒక అజ్ఞాత చరిత్రగా మిగిలిపోదాం..!!
కలవగలగడం మన విజయం కాదు
కలిసి ఉండలేకపోవడం మన ఓటమీ కాదు..
చేయని నేరానికి శిక్ష అనుభవించేది
నేరస్థులు మాత్రమే కాదు....
పదికి తొమ్మిది మంది ప్రేమికులు కూడా..!!
నువ్వు ధైర్యంగా ఉండు,
కాలాన్ని కాల్చేసే అంత కసితో
నిత్యం మండుతూనే ఉండు..
రుణం తీరిపోయిన క్షణాన
దీపం అదే ఆరిపోతుందిలే..
-శతఘ్ని..!!
Read More at : https://www.facebook.com/vineel81?fref=nf
ఏడవగలిగినవాడే... ఏడిపించగలడు కూడా..
అన్న నిజం ఇద్దరికీ తెలిసిందేగా...!!
ప్రాణం లేని శిలలమై
కాల ప్రవాహంలో శిధిలమై
ఏ చరిత్రకారుడూ ఎప్పటికీ పోల్చుకోలేని
ఒక అజ్ఞాత చరిత్రగా మిగిలిపోదాం..!!
కలవగలగడం మన విజయం కాదు
కలిసి ఉండలేకపోవడం మన ఓటమీ కాదు..
చేయని నేరానికి శిక్ష అనుభవించేది
నేరస్థులు మాత్రమే కాదు....
పదికి తొమ్మిది మంది ప్రేమికులు కూడా..!!
నువ్వు ధైర్యంగా ఉండు,
కాలాన్ని కాల్చేసే అంత కసితో
నిత్యం మండుతూనే ఉండు..
రుణం తీరిపోయిన క్షణాన
దీపం అదే ఆరిపోతుందిలే..
-శతఘ్ని..!!
Read More at : https://www.facebook.com/vineel81?fref=nf
0 comments :
Post a Comment