"నీ మనసులో నా స్థానం ఏమిటి?"

what is my place in your heart ?

"నీ మనసులో నా స్థానం ఏమిటి?" అని ఒకసారి నా చెలి నన్ను అడిగింది....!
నాకు అర్ధం కాని విషయం ఏమిటి అంటే, నా మనసే తానైనప్పుడు...
అందులో మళ్లీ నేను తనకి స్థానం ఇవ్వడం ఏమిటో?అందుకే, జవాబు ఏం చెప్పాలో తెలియక...
ఆ ప్రశ్న అడిగి నా జవాబు కోసం అమాయకంగా ఎదురుచూస్తున్న నా చెలిని దగ్గరకు తీసుకుని...
ప్రేమగా తలనిమిరి...సూటిగా తన కళ్ళల్లోకే చూస్తూ...ఒక చిన్న నవ్వు నవ్వాను....! 
అర్ధం అయ్యీ...కానట్టు చూస్తూ...అప్రయత్నంగా నా గుండెపై తాను ఒదిగిపోయింది....! 

కనీసం అప్పుడైనా తనకి తెలిసిందో లేదో మరి..... ఆ గుండెచప్పుడు తనకోసమే అని.....!

--------------  వినీల్ 


Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment