ఇన్నాళ్ళ నా ' ఎదుగుదలలో '
ఎదురైన అనుభవాలు ఎన్నో..
నూరేళ్ళ జీవితపు ' తరుగుదలలో '
కీలకమైన మలుపులు మరెన్నో...
నన్ను నేను వెతుక్కుంటూ,
సాగించినప్రయాణంలో...
నవ్వుకున్న క్షణాలు నాలుగే సుమా..
పొంగే కన్నీటిని విసుక్కుంటూ,
నా కన్నులు అలిగిన క్రమంలో..
'నవ్వంటే' నా పెదవులకు
'పరాయి' భావమా...?
ఏదో పోగొట్టుకున్నాననే బాధ
ఎన్నడూ లేదు
ఏదీ పొందలేకపోయాననే
భావనసలే రాదు...
మరి ఈ మది అంతర్మధనానికి,
కారణం ఏమై ఉంటుంది?
అన్న నా ఈ అంతులేని ప్రశ్నకి,
నావైపు చూసి 'శూన్యం' అదోలా నవ్వింది.
Read More at Vineel Kranthi Kumar
సాగించినప్రయాణంలో...
నవ్వుకున్న క్షణాలు నాలుగే సుమా..
పొంగే కన్నీటిని విసుక్కుంటూ,
నా కన్నులు అలిగిన క్రమంలో..
'నవ్వంటే' నా పెదవులకు
'పరాయి' భావమా...?
ఏదో పోగొట్టుకున్నాననే బాధ
ఎన్నడూ లేదు
ఏదీ పొందలేకపోయాననే
భావనసలే రాదు...
మరి ఈ మది అంతర్మధనానికి,
కారణం ఏమై ఉంటుంది?
అన్న నా ఈ అంతులేని ప్రశ్నకి,
నావైపు చూసి 'శూన్యం' అదోలా నవ్వింది.
Read More at Vineel Kranthi Kumar
0 comments :
Post a Comment