ఉయ్యాల ఈ మట వినగానే చిన్నా పెద్దా తేడా ఉండదు.

...........ఉయ్యాల.................

ఉయ్యాల ఈ మట వినగానే చిన్నా పెద్దా తేడా ఉండదు.
ధనిక,మధ్యతరగతి,బీద వర్గాలు కనబడవు
అందరి మనసులలోను అబ్బా ఓ సారి ఊగితే బావుండునన్న కోరిక కలుగుతుంది.
చిన్నపిల్లలయితే హాయిగా వెళ్ళి ఆడుకుంటారు.
ఈడొచ్చిన పిల్లలు సయితం వదలరు.
ఇంటికి వెళదాం రమ్మన్నా కదలరు.
పెద్దవారు ఎవరూ చూడటం లేదు అనుకుంటే పిలల్లతో పోటీపడుతూ చక్కా ఊగేస్తారు.
నాకు తెలుసు చదువుతున్న చాలామంది ఈపని చేసే ఉంటారు..నేనేమీ మినహాయింపు కాదులెండి.
మనసులో ఉన్న పసితనపు కోరిక తీర్చుకుంటాము..

పుట్టిన నాటి నుండీ 21వ రోజు నాడు ఉయ్యాల పండుగ చేసి
మొదటి సారి పసిపిల్లలని ఉయ్యలలో పడుకోబెడతాము.
ఎవరి తాహతుకు తగ్గట్టు వారు ఉయ్యలలో వేస్తారు
కొందరు గుడ్డ ఉయ్యల వాడితే కొందరు ఇనుము ఉయ్యాల మరికొందరు చెక్క ఉయ్యాల.
అప్పటి నుండీ మొదలు ఉయ్యాలతో సావాసం.
ఎన్నో కబుర్లు,కథలు పెరిగే వయసుతో బాటు జ్ఞాపకాలు
కాస్త పెద్దయ్య్యక ఇంటి కమ్మెకో లేక చెట్టుకో ఉయ్యాల కట్టించి ఊగటం
స్నేహితులతో సరదాగా సమయాన్ని పంచుకోవటం జరుగుతుంది.
మన దేశంలో అయితే ఏకంగా ఓ పండుగే ఉండి ఏడొచ్చిన ఆడపిల్లలకోసం.
చక్కగా అలంకరించిన ఉయ్యలపై వారిని ఊగమంటారు.
పెద్దవారు అలా ఊగలేరనే ఇళ్ళలోపల పెట్టుకునే ఉయ్యాలల ఆవిష్కారం జరిగింది.
కాసేపు అలా ఊగితే ఎంతో హాయిగా ఉంటుంది.
ఒక వయసు దాటాక ఉయ్యాలలో కూడా కూర్చోలేము.
అందుకే రోకింగ్ కుర్చీలు తయారయ్యాయి.
ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ ఇదో భాగం
సముద్రపు ఒడ్డున,విహార స్థలాలలోనూ,పార్కులలోనూ ఇదో సరదా వస్తువు
ప్రతి ఒక్కరి మనసునీ పసితనంలోకి లాగేస్తుంది
చూసేవారి మనసులు కూడా ఆ ఊయలలా గాలిలో తేలుతాయనటంలో సందేహంలేదు
మా ఇంట్లో మా పిల్లలకూ నాకూ ఎప్పుడూ గొడవే ఉయ్యాల దగ్గర.
నా ప్లేస్ అంటే నా ప్లేస్ అంటూ...
ఇలా ఎన్నో రూపాంతరాలు చెందుతూ తన ఉనికిని ఇప్పటికీ కోల్పోలేదు ఈ ఉయ్యాల.
ఇప్పుడు దాదాపుగా ఉయ్యాల ఇళ్ళలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులలో ఒకటిగా అయింది.@తులసి..18-3-15.
Read More at : https://www.facebook.com/madhu.chowdary.96199?fref=nf 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment