"చినుకుల పుణుకులు వేస్తున్నా... మరిగిన ధరిణి పెనం పై......"

"చినుకుల పుణుకులు వేస్తున్నా...
మరిగిన ధరిణి పెనం పై......" అని ఒకటి,
"మామూలోళ్ళంటే పట్టేదెవరు...మెచ్చుకోబడాలంటే గుఛ్ఛాలివ్వాలి లేక గిచ్చాలేమో ... " అని మరొక ఒక ఆణిముత్యాన్ని ఏదో గ్రూపులో ఇప్పుడే అనుకోకుండా చూడటం జరిగింది. ...
ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని విశ్లేషణలు జరిగినా ఏ మాత్రం మార్పులేని వ్రాతలతో జనాల పైన ఈ కవివర్యుల దండయాత్ర ఏమిటో... ఖర్మ...!!
మనం వ్రాసేది ఎదుటి మనిషికి అర్ధం కాకపోయినా , కనీసం మనకైనా మనం వ్రాసిన దానికి ఒక అర్ధం అంటూ ఏడ్చింది అనిపించాలి కదా...? నేనేమీ పెద్ద పొడిచే కవిని, రచయితను కాను అనే స్పష్టత నాకు ఉంది కానీ... మరీ ఇలా నోటికి వచ్చినట్టు, అర్ధం పర్ధం లేకుండా వ్రాయడం చూస్తుంటే తెలుగు భాష పట్ల జుగుప్స పుడుతుంది... కొత్తగా ఉంటుంది అనే భ్రమలో ఇంత చెత్తగా వ్రాస్తూ, మన తరువాతి తరం వారికి మనం ఏం సంకేతం ఇస్తున్నట్టు...
చినుకుల పుణుకులు ఏమిటో... పైగా వాటిని పెనం పై వేయడం ఏమిటో...... ఉఫ్....
పెద్దన్నా.... నీకు పొర్లు దండాలే....!!
*ఇక్కడ కవి తాలూకు తపనని తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు... అతగాడిని తక్కువ చేసి మాట్లాడాలి అని నా అభిమతం అంతకన్నా కాదు కానీ, ఏమాత్రం ధ్యాస లేకుండా , తన అక్షరాలపై, తన భావాలపై తనకే పట్టని తన నిర్లక్ష్యం పై, అష్ట దిగ్గజాలలో ఒకరి అవతారంగా తనకి తాను భావించే తన ఆతి ఆత్మవిశ్వాసానికి, స్నేహితుల - శేయోభిలాషుల మాటని కూడా . చెవిన పెట్టి , సలహా ఇచ్చిన పాపానికి చెప్పా పెట్టకుండా అందరినీ బ్లాక్ చేసే తన అహంకారానికి , ఏది వ్రాసిన "వహ్వా" లతో తన మనసు నింపే తన భజనగాళ్ళు చేసే ఎగతాళిని కూడా గుర్తుపట్టలేని తన అమాయకత్వానికి ఇది నా ఆలస్యపు ప్రతిస్పందన మాత్రమే...!!
-శతఘ్ని..!!
Read More on https://www.facebook.com/vineel81
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment