కిలకిలా నవ్వులతో
ఘల్లుఘల్లనే అందెల సడితో
రంగురంగుల సీతకోకచిలుకల్లా
తరలి వచ్చినారె తరుణీమణులు
గాజులా గలగలలతో చేదనే
విడెచేను బావిలోన
నిండార మునిగాక లాగేను పైపైకి
నింపేను నిండుగా నీటిని బిందెనిండా
అందరీ బిందెలు నిండగా
లంగాలు కాస్త పైకెత్తి దోపి
సనన్నీ నడుమొంపులో బిందెనెట్టి
మంజీర నాదల కిలకిలారావాల
సవ్వడులతో తరలిపోతిరే ఎవరింటికాళ్ళు.
లేవెక్కడా ఈనాడు కళకళలాడే ఆ బావులు
రెపరెపలాడే సంప్రదాయపు లంగాలు ఓణీలు
నిండుకున్నవి బావులన్ని కానరాని కన్నీటితో
జ్ఞాపకాలన్ని అల్లంత దూరాన నాటివే
నేడేవీ కానరావు కళ్ళెంత చేసి చూసినా
ప్రాణాలు లేని బొమ్మగా మిగిలింది కళామతల్లి బిడ్డల కుంచె గీతలలో..@తులసి.
Read More at : https://www.facebook.com/madhu.chowdary.96199?fref=nf

0 comments :
Post a Comment