నువ్వు తప్పు చేశావ్... వాడి మీద నీ ఆవేశాన్ని చూపించావ్..

నువ్వు తప్పు చేశావ్...
వాడి మీద నీ ఆవేశాన్ని చూపించావ్..
వాడు కూడా ఆవేశపడ్డాడు...
నువ్వు భయపడ్దావ్..
వాడినంటే ఆపగలవేమో..
మరి వాడి ఆవేశాన్నెలా ఆపగలవు?

నువ్వు ఇచ్చిందే కదా..?
తీసుకోనంటే ఎలా?
వాడు చేసిన తప్పుకి
నువ్వు ప్రేమనిచ్చి ఉంటే,
సహనాన్ని ఇచ్చి ఉంటే,
క్షమ ని ఇచ్చి ఉంటే,
జాలిని ఇచ్చి ఉంటే,
ఇప్పుడు ఇంత అవస్థపడేవాడివా??
ఏమిటో...ఈ మనిషి జన్మ..
అటు ఇవ్వడానికి భయపడి,
ఇటు తీసుకొవడానికీ భయపడి,
అసలేం బ్రతుకుతున్నామో అనిపిస్తోందా?
మరేం పర్లేదు,
నీ భయం ఇవ్వడానికో - తీసుకోవడానికో
దేనికో ఒక్కదానికే పరిమితం చెయ్యి..
అంతా అదే సర్దుకుంటుంది...!!
-శతఘ్ని..!!
Read more at..: https://www.facebook.com/vineel81?fref=nf 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment