'అలుపు' అన్నది ఒకటుంటుందనే
తలపు నిన్ను చేరనీయక.....
'గెలుపు' నీకై వేచి ఉందని,
నమ్మి సాగు ఉందిగా ఓపిక....
ఆత్మవిశ్వాసంతో అడుగు వేసినప్పుడు,
అపజయం అన్నది చేయదు చప్పుడు...
నమ్మకంతో సాగే నీ వేగానికి,
ఎంతటి దూరాలైనా తరిగిపోవా...
ఆశ తొణికిసలాడే నీ ఆలోచనకి,
తలవంచి... తీరాలే తరలి రావా.....
ఎదుగుతూ ఉండు .....ఎవరూ ఊహించనంతగా...
ఎగబాకుతూ ఉండు... ఎక్కడానికి ఇక ఏ మెట్టు మిగలనంతగా...
ఇన్నేళ్ల ఆలోచనలని,జ్ఞాపకాలని,ఆశలని మళ్లీ నీ ముందు నిలబెట్టి నీ దగ్గర మాట తీసుకోవడం కోసం మరోసారి వచ్చిన ఈ 'జన్మదిన' శుభ సందర్భాన అందుకో మిత్రమా...నా ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు...
Read more at : www.facebook.com/vineel81
0 comments :
Post a Comment