నీతో బ్రతకాలని అనుకున్నా......నీ జ్ఞాపకాలతో కాదు

నా మాట నిన్ను బాధిస్తోందా...?
జీవితాంతం మూగవాడిలా ఉండేందుకు నే సిద్ధమే...!
నా చూపు నిన్ను వేధిస్తోందా....?
బ్రతుకంతా కళ్ళు మూసి ఉంచేందుకు నే సిద్ధమే....!
నా తలపు నిన్ను సాధిస్తోందా...?
దాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియడం లేదే...?
నేనెలాగూ నీ దాకా రాలేను.....రాను..
వద్దన్నా నిను చేరే నా తలపునూ ఆపలేను...
మరి ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం ?
నాబారి నుండి నీకు ఉపశమనం కలిగించే,
దయగలదొకటే....అది మరణమని....
అనుకుంటే చెప్పు వెంటనే.....దాన్నిఆహ్వానిస్తా,
ఆలోచించకు అది దారుణమని...!
ఎన్నటికీ తీరిపోని తీపి రుణమై నువ్వున్నా...
తిరస్కారమే నీకు తగినదని (ప్రేమతో..?) నువ్వన్నా...
సంతోషించడానికి....బాధ వాకాశం ఇవ్వదుగా....
బాధపడదామన్నా......కొత్తగా ఏం కోల్పోలేదుగా...
ముచ్చటగా నీ మెడలో మూడు ముళ్ళు వేయాలని,
ఆశపడ్డ 'ఆశ' నిరాశ అయి...
ఉరితాడై నా మెడకు బిగిసిందది...
ఉసురుతీసే యమపాశమై.....!
చివరిగా ఒక్క మాట చెబుతా,
నువు పట్టించుకోవని నాకు తెలిసినా....
నీతో బ్రతకాలని అనుకున్నా కానీ,
నీ జ్ఞాపకాలతో కాదు...
Click here to read more....... 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment