ఒంటరితనం ఎంత సుఖమో...

ఒంటరితనం ఎంత సుఖమో... కొన్ని కల్పనలూ...మరికొన్ని వాస్తవాలనూ జోడించి నాదైన తరహాలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా....!
"కలిసి ఉంటే కలదు సుఖము" అని నాకు క్లాసులు పీకాలనుకునే మేధావులందరికీ నమస్కారమని.... అలాంటి వారందరూ నా ఈ పోస్టుకి దూరంగా ఉండగలరని .... సిల్లీ కామెంట్స్ చేయరాదని .... లేనిపోని చర్చలకు తెరలేపవద్దని....దీన్ని అందరూ కేవలం కవితలా మాత్రమే చదివి... ఆస్వాదించమని సవినయంగా మనవి చేసుకుంటూ..........

ఒంటరితనమెంతో ముద్దు..!
**************************
పొయేదేమున్నదని ఒంటరిగా నేనుంటే
ప్రేమించేవారెందుకని నాపైనాకు ప్రేముంటే
జోడెడ్ల బండి కానక్కర్లేదు బ్రతుకంటే
జోడీ వద్దే వద్దు ,బలుసాకు తినొచ్చు బ్రతికుంటే

నచ్చినట్టు నేనుంటా కాదనేవారెవ్వరు
తప్పులెంచి నాపై రాళ్ళెవరూ రువ్వరు
పదిమందీ చుట్టూ ఉంటే,మనశ్శాంతినివ్వరు
మతలబులేనిదే ఎవరూ, మనవారవ్వరు....

పేరుపెట్టి పిలిస్తే కానీ
పలకని ఏ బంధానికన్నా
తలచినదే తడవుగా పలికే
నేనే నాకు మిన్న...
ఆశపడ్దావో అయిపోతావ్
ప్రేమ, పెళ్లి అంటే నిండు సున్నా
నిలువుదోపిడీ అయ్యే
ఆఫర్లు నీకెందుకురా నాన్న...

తోడులేనంత మాత్రాన
తొలకరి నను తడపకపోదు
మరగనంతనే మరుమల్లెల ఆత్రాన
నా రేయి గడవకపోదు....

బాధలన్నిటినీ చేసి బేఖాతరు
మనసుకద్ది చిరునవ్వుల అత్తరు,
పెగ్గులేస్తే ఓ ఐదారు
రంభా ఊర్వశిలే దిగిరారూ?

ఒంటరితనమంటే బాధ్యతలేకుండా
ఉండటం కాదు....
వేరెవ్వరికీ బరువవ్వకపోవడమే..
ఇది ఎవ్వరికీ అర్ధం కాదు....!


Vineel Kanthi Kumar 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment