తొలి ప్రేమ .............
నీకోసం రాసే ఈ ప్రేమ లేఖ అక్షరాలతో కాదు
మనసుతో వ్రాస్తున్నా
ఊపిరినే అక్షరంగా మలచి
మదిలో భావాన్ని శ్రుతి చేసి వ్రాస్తున్నాను
ప్రతి నిత్యం ఓ ఉషోదయం నిన్ను చూసే ఈ కళ్ళకి
లేలేత కిరణాలు నీ కురులపై పడి
గాలి తెమ్మెరలతో నన్ను తాకుతుంటే
రోజంతా అలాగే అక్కడే
నీ కురులతో ఎన్నెన్నో ఊసులు చెప్పాలనుంటుంది
అందమంటే అర్ధమయ్యేది కాదు ఇన్నాళ్ళు
తొలిసారి తెలిసింది నీ కళ్ళు చూస్తుంటే
అణుకువగా వుండే అమ్మాయి
ఈ రోజుల్లో ఉంటుందా అని నవ్వుకునే వాడిని
నిన్ను చూసిన తరువాత
నాలో నేనే సిగ్గు పడుతున్నాను
వెనక్కి రాని, తిరిగి తీసుకోలేని నా మాటల కోసం
ప్రేమ ఒక్కసారే పుడుతుంది
తొలిసారి నిన్నుచూసాకే కలిగింది
నిను నమ్మించడానికి
నా ప్రేమే నిజమని చెప్పడానికి కొన్ని యుగాలు పట్టచ్చు
నా మనసే నీ దైతే ఒక్క క్షణం చాలు
నువ్వునాలో ఉన్నావనే నిజం తెలుసుకోవడానికి
ఇప్పటికైనా చెప్పకపోతే జీవితమేమీ కోల్పోనూ
అంతకంటే విలువైన నిన్ను
చేజార్చుకుంటాననే భయంతో రాస్తున్న ప్రేమలేఖ ఇది
శ్రుతి చేసిన నా మనోవీణపై
ప్రియ మానసరాగాలు పలికించాలని
నీ ప్రేమకై ఆరాధనతో వేచిచూస్తూ నీ ............@ బాటసారి

0 comments :
Post a Comment