కెమెరాకీ సంస్కారం నేర్పండి...
____________________
కెమెరా దేన్నయినా షూట్ చెయ్యగలుగుతుంది.. దానికి విచక్షణ లేదు.. విచక్షణ ఉండాల్సింది దాన్ని వాడే మనుషులకు!
ఏ టీ సెంటర్లోనో కూర్చుని కెమెరా జూమ్ చేసి రోడ్డున పోయే అమ్మాయిలూ, మహిళల్ని రకరకాల భంగిమల్లో ఫొటోలు తీసి నెట్లో upload చేసే వాళ్ల సంస్కారాన్ని ఏమనుకోవాలి?
అలాగే ఈ మధ్య రొమాన్స్ కూడా పబ్లిక్ అయిపోతోంది. నాలుగు గోడల మధ్య గడిపే క్షణాల్ని సినిమాల్లా, షార్టు ఫిల్మ్ల్లా పరస్పర అంగీకారంతోనూ, కొన్నిసార్లు గోప్యంగానూ షూట్ చేసుకుని జీవితాల్ని బజారు పాలు చేసుకుంటున్నారు.. బ్లాక్ మెయింలింగులు చేసుకుంటున్నారు.. చివరకు కొందరైతే చనిపోతున్నారు కూడా..
ఎందుకింత నైతిక పతనం?
మనిషి ఆది మానవుడిగా ఉన్నప్పుడు రమించాడు.. కట్టుబాట్లు లేవు.. వావివరుసలూ ఉండేవి కాదు.. మృగంలా బ్రతికేవాడు.. ప్రవర్తించే వాడు.. ఇప్పుడు మళ్లీ ఆ మృగత్వపు ఛాయలు మనలో ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి.
కొన్ని విషయాలకు గోప్యత అనుసరించడం వెనుక చాలానే పరమార్థముంది. జనాలు పిచ్చి వాళ్లై కాదు... తరాల తరబడి నాలుగు గోడల మధ్య శృంగారానికి కట్టుబడి ఉన్నది! నైతిక విలువలు పాటించని రోజున చాలా సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వాటిని తట్టుకునే శక్తి లేక జనాలు అర్థాంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటారు.. లేదా హత్యలు చేస్తారు. ఇవ్వాళ మనం చూస్తున్న సమాజం అలాంటి నేపధ్యాల నుండి పెరిగిపోతున్న క్రైమ్సే.
పశువు ఉంటుంది... దానికి జ్ఞానం ఉండదు.. అది ఎలా ప్రవర్తించినా మనం చూస్తూ ఉండడం తప్పించి చెయ్యగలిగిందేమీ లేదు. మనుషులు పశువులు కాదు కదా... పశువులుగా ప్రవర్తించడం ఎంతవరకూ కరెక్ట్?
"నాకు వేల్యూసే లేవు... నా లైఫ్ నా ఇష్టం" అని కట్టుబాట్లనీ, నైతికతను విస్మరించి ఊరేగిన వాళ్లందరి జీవితాలూ రోదనల్లో కుంగిపోతున్నాయి.. అలాంటివి రుచిచూస్తేనే అర్థమవుతుందేమో చాలామందికి!!
- నల్లమోతు శ్రీధర్

0 comments :
Post a Comment