లీస్ట్ expressiveనా?
_______________
"హాపీగా ఒక్క నవ్వు నవ్వొచ్చు కదా.. నా కడుపు నిండిపోతుంది.." అనంటారు కొందరు...! "సరేలే" అని పళ్లికిలిస్తే అవతలి వాళ్లకు శాటిస్ఫేక్షన్ ఉండదు.. "ఏదో అడిగించుకుని మరీ నవ్వించుకున్నట్లుంది.. వద్దులే" అని డిజప్పాయింట్ అయిపోతారు.
ఇలాంటివి మనం రోజూ చూసే సీన్లే. మనకు ఎదుటి వ్యక్తి నుండి ఎక్స్ప్రెషన్ కావాలి.. మనం వాళ్లని ఎంత ఎఫెక్షనేట్‌గా చూస్తున్నామో.. ఆ స్థాయికి తగ్గకుండా వాళ్ల నుండి ఎక్స్ప్రెషన్లు కావాలి.. అప్పుడే మన కళ్లల్లో వెలుగొస్తుంది.
కానీ పాపం కొంతమంది లీస్ట్ ఎక్స్‌ప్రెసివ్. గుండె లోపల మనకన్నా ఎక్కువ ప్రేముంటుంది... కానీ పైకి ఎలాంటి ఫీలింగూ రానే రాదు. రేసు గుర్రం సినిమాలో శృతిహాసన్‌లా ఎలాంటి ఫీలింగులూ లేని ఆ ఫేస్‌లు చూసి మనకు మతిపోతుంది... "మనుషులు ఇలా కూడా ఉంటారా" అని! బట్ తప్పేం లేదు.. లేని ఎఫెక్షన్‌ని పైకి విపరీతంగా నటించే వాళ్లు సొసైటీలో కోకొల్లలు. వాళ్లతో పోలిస్తే గుండెలోతుల్లో మన పట్ల చెరిగిపోయి అభిమానం ఉన్న లీస్ట్ ఎక్స్‌ప్రెసివ్ పీపుల్ కొన్ని వందల రెట్లు బెటర్.
అయినా మనకు అంత ఈజీగా శాటిస్ఫేక్షన్ ఉండదు.. ఫలానా విధంగానే నవ్వాలి.. ఫలానా టైమ్‌లో ఫలానా విధంగానే రెస్పాండ్ అవ్వాలి.. మనం బాధలో ఉంటే.. సానుభూతి చూపాలి.. కొన్ని కొన్ని ప్రీ డిఫైన్డ్ రిక్వైర్మెంట్లు మనకు మైండ్‌లో ఉంటాయి.
సో "నాకు చాలా ఫీవర్‌గా ఉంది..." అని మీరు అంటే.. "అయ్యో.. అవునా.. నేను వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్లేదా.." అని కబుర్లు చెప్పే వాళ్లే మనకు నచ్చుతారు. వాళ్లు రావడానికి కుదరదనీ తెలుసు... వాళ్లు రారనీ తెలుసు.. అయినా "మాట వరుసకైనా అన్నారు కదా" అనే సంతృప్తి
అభిమానం, ప్రేమ, ఎఫెక్షన్ అంతా నిరంతరం మనస్సులో ప్రవహించాలి.. అది బయటకు express చెయ్యబడితేనే గొప్ప కాదు. దాన్ని అందమైన మాటల్లోనో, కవితల్లోనో, కబుర్లలోనో express చేసే వాళ్లే గొప్ప కాదు.. అస్సలు ఏమీ express చెయ్యకుండా మౌనంగా అభిమానించే వాళ్లూ సమానంగా గొప్పోళ్లే.
Expression బేస్డ్గా రిలేషన్ల క్వాలిటీ జడ్జ్ చేసేముందు కొంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే బెటర్. లేదంటే మౌనంగా అభిమానించే జనాలు మనకు తెలీకుండానే దూరమవుతారు... కారణం వాళ్లు నోరు విప్పి ఏదీ వ్యక్తపరచలేరు.. పరచరు కాబట్టి!!
- నల్లమోతు శ్రీధర్

0 comments :
Post a Comment