విప్లవ జ్యోతి మన "భగత్ సింగ్" గురించి తెలుసుకుందాం .........

విప్లవ జ్యోతి మన "భగత్ సింగ్" గురించి తెలుసుకుందాం .........
జననం 28 సెప్టెంబరు 1907, ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిషు ఇండియా
మరణం 23 మార్చి 1931 (వయసు 23) లాహోరు, పంజాబ్, బ్రిటిషు ఇండియా
ఈనాటికి యువతీ యువకుల్లో ఎవరి పేరు చెపితే నెత్తురు వేడెక్కుతుందో , దేశభక్తి అంబరాన్ని తాకుతుందో అతడే మన ప్రఖ్యాత ఉద్యమకారుడు,భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఒకరు అతి చిన్న వయసులోనే దేశమాత కోసం ఉరికంబం ఎక్కిన త్యాగధనుడు మన భగత్ సింగ్ . 'షహీద్ భగత్ సింగ్' గా దేశం మొత్తం పిలుచుకునే దేశ భక్తుడు.
పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. సంధుఝాట్ కుటుంబీకుడు. భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ యొక్క కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేసేవారు .
భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. పసి వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక
విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ 'హర్నామ్ కౌర్' ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు.
బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత ఆయన తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు. బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను ఆయన తండ్రి చేర్పించాడు.13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.
1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచనా పోటీలో భగత్ విజయం సాధించాడు. దాంతో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయసులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యల ను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు మరియు సియోల్‌కోట్‌కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు, సాహిత్యాన్ని ఆయన పఠించాడు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్‌లోని నేషనల్ కాలేజ్‌లో విధ్యనభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ ("భారత యువ సంఘం")లో చేరాడు.
యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు. అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టెక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకరుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు.
భగత్ సింగ్ అరాజకవాదం(అనార్కిజం), సామ్యవాదం(కమ్యునిజం) అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ మరియు ట్రాట్స్కి ల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం. అహింస, సత్యాగ్రహాలను బోధించే గాంధేయవాదం మీద భగత్ కి నమ్మకం ఉండేదికాదు. గాంధేయవాదం దోపిడిదారుల్ని మారుస్తుందే కానీ, దోపిడీ నుంచి విముక్తి కల్పించదని భగత్ విశ్వసించేవాడు.
నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్ ఆయన సహ విప్లవకారులు యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రామ్‌ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు. ఆయన అమృత్‌సర్ నుంచి ప్రచురించబడిన ఉర్దూ మరియు పంజాబీ వార్తాపత్రికలలో వార్తలను వ్రాశాడు మరియు సరిదిద్దాడు. సెప్టెంబరు 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. HRA ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీయబడిన కారణంగా ఆయన తన సహ విప్లవకారుడు సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కారణమైంది.
లాలా లజ్‌పత్ రాయ్ మరణం మరియు సాండర్స్ హత్య:
1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జైపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్‌కు జైపాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
అసెంబ్లీలో బాంబు :
విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది.భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం. అయితే మండలిలో ఒక్క ఓటు తేడాతో ఈ చట్టం ఆమోదం పొందలేదు.ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. అసెంబ్లీపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు బటుకేశ్వర్ దత్‌ను బాంబు దాడికి ఎంచుకున్నారు.
8 ఏప్రిల్ 1929న అసెంబ్లీ వసారాలపై సింగ్ మరియు దత్‌లు బాంబు విసిరి, "ఇంక్విలాబ్ జిందాబాద్! " అని నినదించారు. ("విప్లవం వర్థిల్లాలి!"). దీని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను వెదజల్లారు. బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూరంగా విసరబడింది.బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు.
విచారణ మరియు ఉరి:
తన కుమారుడిని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు, "నా విడుదల కన్నా నా మరణం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం" అని చెప్పి, పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తన తండ్రికి సూచించాడు.
సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.
ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు. 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది.
కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ "నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, "ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా మరియు ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు" అని అన్నాడు.
డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్‌ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు. భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడుతాయి. "దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడయ్యాను?" అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు. తనను కొందరు అహంకారి అనడంపై కూడా సింగ్ ప్రస్తావించాడు. సొంత విశ్వాసాలను గౌరవించే సింగ్ సర్వశక్తి సంపన్నుడి పట్ల దృఢ విశ్వాసినని చెప్పేవాడు. అయితే ఇతరుల హృదయాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు మరియు విశ్వాసాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేశాడు. మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించానని అయితే నిరూపితం కాని ఆ తత్వం మానవ బలహీనతకు సంకేతమని తన వ్యాసంలో సింగ్ పేర్కొన్నాడు.
ఆఖరి కోరిక :
తాను (భగత్ సింగ్) "తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తలవెంట్రుకలు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం" జరిగింది. "దేశ సేవ కోసమే అదంతా" . తన సహచరులు "సిక్కు రూపాన్ని మార్చుకునే విధంగా ఒత్తిడి చేశారు" దానికి తోడు ఆయన "తలవంపులు తెచ్చాడని" ఆయన జైలు సహచరుడు, ఘదార్ విప్లవకారుడు, సిక్కు వర్గంలో ప్రముఖుడు రణ్‌ధీర్ సింగ్‌, భగత్ సింగ్ తో అన్నట్లు తెలిసింది. రణ్‌‌ధీర్ సింగ్ సహా పంచ్ ప్యారే నుంచి అమృత్‌ను పొందాలని తనను ఉరితీయడానికి ముందు ఆఖరి కోరికగా సింగ్ చెప్పినట్లు తెలిసింది. అయితే పంచ్ ప్యారే నుంచి అమృత్‌ పొందాలన్న ఆయన ఆఖరి కోరికకు బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు.
మహాత్మా గాంధీ కాస్త చొరవ చేసి వుంటే :
సింగ్‌ను ఉరితీయకుండా ఆపే అవకాశం మహాత్మా గాంధీకి ఉండటం చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అయితే ఆయన అలా చేయలేదు. భగత్ సింగ్‌ పట్ల విచిత్ర వైఖరితో వ్యవహరించిన వ్యక్తిగా గాంధీని అప్పట్లో కొన్ని వర్గాలు అనుకున్నాయి . అయితే సింగ్‌ను ఉరితీసేలా బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి గాంధీ కుట్రపన్నాడనేది మరో భిన్న వాదం. ఈ రెండు వాదాలు కూడా సందేహాస్పదంగానూ మరియు వివాదాస్పదంగానూ మారాయి.
తన సత్యాగ్రహ ఉద్యమంలో సభ్యులు కాని 90,000 మంది రాజకీయ ఖైదీలను గాంధీ-ఇర్విన్ ఒప్పందం ద్వారా "రాజకీయ ఉద్రిక్తతకు ఉపశమనం" అనే కారణంతో విడుదలయ్యేలా గాంధీ చేయగలిగాడు. ఫ్రంట్‌లైన్ అనే భారత సంచికలో ప్రచురించిన కథనం ప్రకారం, 19 మార్చి 1931న వైస్రాయిని గాంధీ వ్యక్తిగతంగా కలవడం సహా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల మరణశిక్షను తగ్గించమంటూ ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అప్పటికే సమయం దాటి పోయిందన్న విషయం తెలియక ఉరి రోజున కూడా శిక్షను తగ్గించమంటూ వైస్రాయ్‌ని లేఖ ద్వారా ఆయన అభ్యర్థించాడు.
ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.
మేరా రంగ్ దే బసంతీ చోలా
ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా
మేరా రంగ్ దే బసంతీ చోలా
యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా
నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా
మేరా రంగ్ దే బసంతీ చోలా
గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.
23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు. అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ ప్రకారం, సింగ్‌ను ముందుగానే ఉరితీశారు:
సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీశారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది.
సమ్ హిడెన్ ఫ్యాక్ట్స్ :
మార్టేర్డోమ్ ఆఫ్ షాహీద్ భగత్ సింగ్-సీక్రెట్స్ ఉన్ఫూర్లెడ్ బై యాన్ ఇంటలిజెన్స్ బ్యూరో ఏజెంట్ ఆఫ్ బ్రిటీష్-ఇండియా నిఘా సంస్థ ప్రతినిధి చేత రహస్యాల బహిర్గతం అనే శీర్షికతో K.S. కూనర్ మరియు G.S. సింధ్రా రాసిన పుస్తకం 28 అక్టోబరు 2005న విడుదలయింది. సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లు అర్థ స్పృహకు చేరుకునే విధంగా వారి ముగ్గుర్ని ఉద్ధేశ్యపూర్వకంగానే ఉరితీశారు. తర్వాత వారిని జైలు బయటకు తీసుకెళ్లి సాండర్స్ కుటుంబం చేత చంపించారని సదరు పుస్తకం స్పష్టం చేసింది. అంతేకాక ఇదంతా "ఆపరేషన్ ట్రోజన్ హార్స్" పేరుతో జైలు కార్యంగా ఆరోపించింది. ఈ విషయం పై ఇంకా ఎన్నో సందేహాలు వున్నాయి .
సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.
బహుదూరపు బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment