మీరు దైవమా.. దెయ్యమా?
_____________
మొదట ఓ వర్గం అన్యాయానికి గురవుతుంది... అణిచి వేయబడుతుంది.. ఆ అణచివేత నుండి కసి రగులుతుంది.. అన్యాయం పట్ల ఆ వర్గం తిరగబడుతుంది.. ఆ వర్గం కొన్ని తరాలకు బలీయమైన శక్తిగా ఎదుగుతుంది..
అప్పుడు అదే వర్గం అన్యాయం చేయడం, మిగతా సమాజాన్ని అణచివేయడం మొదలెడుతుంది. దీంతో మళ్లీ సమాజం అల్లకల్లోలం అవుతుంది.
సమాజం అంతా అన్యాయాలూ, పగలూ, ప్రతీకారాలతోనే అగ్గి బూడిదైపోతోంది. నలుగురు కలిసి బ్రతకడానికి మనం ఈ "సమాజాన్ని" నిర్మించుకున్నది. నలుగురిని ద్వేషించి.. నలుగురికి అన్యాయం చేసీ.. లేదా గతపు దోపిడీకి బదులు తీర్చుకుంటూ పైశాచికంగా ప్రవర్తించదలుచుకుంటే మనుషులు మిగలరు.. మిగిలేది జంతుప్రవృతే.
అదేం చోద్యమో.. శాంతి, ఐకమత్యంచే చాలా సంతోషంగా గడపాల్సిన ప్రపంచ జనాభా మొత్తం ఎప్పుడూ కులాలూ, మతాలూ, ప్రాంతాలూ, అవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు హీరోలా, ఇతర సెలబ్రిటీల ఫ్యానిజాలతో.. చాలా అశాంతితో కొట్టుకు చస్తోంది.
కొట్టుకు చావడానికి కాదు మన తల్లి నవమాసాలూ మోసి ఈ జీవితం ఇచ్చింది.. చేతనైతో నలుగురినీ కలుపుకుపోతూ, నలుగురినీ సంతోషపెడుతూ మనుషుల్లో దైవత్వాన్ని చూడడానికి! కానీ మనకు దైవత్వం ప్రసాదింపబడలేదు.. దయ్యాలు పూనాయి.. వికటాట్టహాసం చేస్తూ..!!
తోటి మనిషి పట్ల దెయ్యంగా బ్రతాకాలో, దైవంలా బ్రతకాలో మీరే నిర్ణయించుకోండి..
- నల్లమోతు శ్రీధర్

0 comments :
Post a Comment