నర్మదా నవ్వమ్మాయ్........

నర్మదా నవ్వమ్మాయ్........

మనసుకు రూపం లేదని తెలుసులే
కాని నీ కళ్ళలోకి చూస్తే ఆ మనసుకి రూపం కనపడుతూంది
ఏదో ఓ చిన్న తప్పు
క్షమించేయ్ అమ్మాయ్ ఈ పట్టుకి
నీ వాడినేగా
ఆ మనసు నాదేగా
అక్కడ ఉన్నది నేనేగా
ఏవంటావ్
చూసి చూడనట్టు వదిలేయాలమ్మాయ్ కొన్ని
అలా మూతి బిగించుకుని చెట్టుకింద కూర్చుని
ఏవిటా వర్షంలో నువ్వు నీ ఏడుపు
కంటి నుంచి జాలువారేవి ఏ చినుకులో ఎలా తెలుస్తుంది చెప్పు
మేఘం విడిచిన అమృత ధారలనుకోనా
పచ్చని పచ్చికను తడిమే మకరందమనుకోనా
ఈ దొంగ బాటసారి ఈ జన్మకి మారడులే అని నీ కన్నీటితో పంచుకునే బాధనుకోనా
ఇదేమన్నా మణిరత్నం సినిమానా
పిసి శ్రీరాం ఫొటోగ్రఫీలో నీ హావభావాలు తెలీటానికి
ఆ ఏడుపాపి చుట్టూ చూడు
నీ అలకలలో అందాల్ని చినుకులెలా ముద్దాడుతున్నాయో
మన కౌగిలిలో చలి కాచుకుందామని తరువులన్నీ ఎలా ఆశగా చూస్తున్నాయో
ఓ నర్మదా నవ్వమ్మాయ్
తెలుసుగా నీ బాటసారి మనసు విహారని
ఎందురున్నా నీకెవ్వరూ సరిరారని ఈ మనసులో ప్రేమ దీపం నీదేనని....@
బహుదూరపు బాటసారి
Photo: నర్మదా నవ్వమ్మాయ్........

మనసుకు రూపం లేదని తెలుసులే 
కాని నీ కళ్ళలోకి చూస్తే ఆ మనసుకి రూపం కనపడుతూంది 
ఏదో ఓ చిన్న తప్పు 
క్షమించేయ్ అమ్మాయ్ ఈ పట్టుకి 
నీ వాడినేగా 
ఆ మనసు నాదేగా  
అక్కడ ఉన్నది నేనేగా
ఏవంటావ్   
చూసి చూడనట్టు వదిలేయాలమ్మాయ్  కొన్ని  
అలా మూతి బిగించుకుని చెట్టుకింద కూర్చుని 
ఏవిటా వర్షంలో నువ్వు నీ ఏడుపు   
కంటి నుంచి జాలువారేవి ఏ చినుకులో ఎలా తెలుస్తుంది చెప్పు  
మేఘం విడిచిన అమృత ధారలనుకోనా   
పచ్చని పచ్చికను తడిమే మకరందమనుకోనా   
ఈ దొంగ బాటసారి ఈ జన్మకి మారడులే అని నీ కన్నీటితో పంచుకునే బాధనుకోనా 
ఇదేమన్నా మణిరత్నం  సినిమానా  
పిసి శ్రీరాం  ఫొటోగ్రఫీలో నీ హావభావాలు తెలీటానికి 
ఆ ఏడుపాపి చుట్టూ చూడు 
నీ అలకలలో అందాల్ని చినుకులెలా ముద్దాడుతున్నాయో 
మన కౌగిలిలో చలి కాచుకుందామని తరువులన్నీ ఎలా ఆశగా చూస్తున్నాయో 
ఓ నర్మదా నవ్వమ్మాయ్
తెలుసుగా నీ బాటసారి మనసు విహారని
ఎందురున్నా నీకెవ్వరూ సరిరారని ఈ మనసులో ప్రేమ దీపం నీదేనని....@ బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment