సూటిగా సుత్తిలేకుండా..

సూటిగా సుత్తిలేకుండా..
______________

SMSలు వచ్చాక భాషంతా మారిపోయింది.. 160 అక్షరాలు దాటితే ఒక message వేస్ట్ అయిపోతుందన్న ఫీలింగ్‌తో... ఎక్కువ మేటర్ కంపోజ్ చేసే ఓపిక కూడా లేక డీటైల్డ్‌గా మాట్లాడుకోవడం తగ్గించేశారు జనాభా. అది "తప్పు కదా" అని ఎవరైనా అంటే.. "సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకోవాలి.. పేరాలు పేరాలు కాదు" అని కళ్లెగరేస్తూ మేధావి ఫోజులు కొట్టడం మొదలెట్టారు.

ఆ తరహా జనాభా పై ఒక్క లాంగ్ సెంటెన్స్ చదివేసరికే ఈ మేటర్ నుండి పక్కకు వెళ్లిపోయి ఉంటారనుకోండి.. సరే అసలు విషయానికి ఇప్పుడు వద్దాం..

భాష, భావం రెండూ కమ్యూనికేషన్‌కి చాలా ఇంపార్టెంట్. మనం ఏం చెప్పదలుచుకున్నామో మనకే తెలీకుండా ఈ మధ్య చాలామంది మాట్లాడేస్తున్నారు. అన్నీ ప్రశ్నలే. ఏ ఒక్క ప్రశ్నలోనూ క్లారిటీ ఉండదు. క్లారిటీ లేని ప్రశ్నకు ఎవరైనా ఎలా రెస్పాండ్ అవుతారు? చిరాకు వస్తుంది కదా?

రిలేషన్ అన్న తర్వాత మనం మాట్లాడే ప్రతీ మాటా ఏ భావంతో మాట్లాడుతున్నామో అవతలి వాళ్లకు అర్థమయ్యేలా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదే!

ఈ మధ్య మనం తరచూ వింటూ ఉన్నాం.. "నేను ఫలానా ఉద్దేశంతో మాట్లాడలేదు... నువ్వు అలా అనుకుంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు" అంటూ చాలామంది మొండితనానికి పోయి రిలేషన్లు పాడుచేసుకుంటున్నారు. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఆ మాట ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో కొద్దిగానైనా అవతలి వాళ్లకు అర్థమయ్యేలా సెంటెన్స్ ఫార్మేషన్లలో express చేసి ఉంటే ఇలాంటి తలనొప్పులు తప్పుతాయి కదా.

ఏదో కొంపలు మునిగిపోయినట్లు పొడిపొడి మాటలు..! I love you అని వందసార్లు చెప్పేస్తే అదే అతి గొప్ప ప్రేమైపోతుంది.. అంతకన్నా బెటర్‌గా express చెయ్యడం, మాట్లాడడం మనకు తెలీదు. అదేమంటే ఎలా మాట్లాడాలో తెలీదు అని తెల్లమొహం వేయడం.

కోపమొస్తే "ఇక లైఫ్‌లో నీ మొహం చూపించకు" అని కసురుకోవడమే. మనమెందుకు బాధపడుతున్నామో.. అవతలి వాళ్లకు అర్థమయ్యేలా express చెయ్యడం చేతకాదు. మనకెలా చెబితే మనం నార్మల్ అవుతామో అవతలి వాళ్లకు చెప్పడం చేతకాదు. చివరకు ఎవరికి వాళ్లు మొహాలు మాడ్చుకుని రిలేషన్లు పుటుక్కున తెంచేసుకోవడం.

"నువ్విలా మాట్లాడి ఉంటే నేను నార్మల్ అయ్యేదాన్ని కదా.. ఎందుకు నువ్విలా బిహేవ్ చెయ్యవు" అంటుంటారు కొంతమంది. అయినా "నాకలా బిహేవ్ చెయ్యడం చేతకాదు... నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా" అని ఓ రెడీమేడ్ రిప్లై ఇస్తాం. అదేమైనా బ్రహ్మవిద్యా కొద్దిగా ఇగో తగ్గించుకుని వెళ్లి బ్రతిమిలాడి అవతలి మనిషిని ప్రసన్నం చేసుకోవడం. మన బోడి ఇగో మాత్రం మనం పక్కనపెట్టం. పద్ధతిగా మాత్రం మాట్లాడం.. కానీ తప్పంతా అవతలి వాళ్లదే అనేస్తాం.

ఈ ఇగోలు ఎప్పటి నుండో ఉన్నవే. కొత్తగా వచ్చిందే ఈ పనికిమాలిన "సంక్షిప్త భాష". అంతా విని "అదేంటి?" అంటారు కొంతమంది. అస్సలు వాళ్ల డౌట్ ఏమిటో కూడా వివరంగా చెప్పే ఓపిక లేని జనాభా. సో అవతలి వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. "ఇప్పటిదాకా ఏం విన్నావ్" అని చిరాకుగా మొహం పెట్టేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లెం మనుషుల మధ్య కాదు. వాళ్లు మాట్లాడుకునే భాషలో క్లారిటీ లేకపోవడం వల్ల.

ఈ lack of clarity సమస్యని గుర్తించే వాళ్లే లేకపోతున్నారు. దాంతో ప్రతీచోటా ప్రతీ సమస్యా ఈ క్లారిటీ మిస్ అవడంతో మరింత ఎక్కువవుతోంది. కొద్దిగా వివరంగా ఓపికగా మాట్లాడండి.. వినండి... చదవండి.. జ్ఞానేంద్రియాలు ఉన్నదే ఈ మూడు పనులు చెయ్యడానికి.. వాటినీ బద్ధకంలో ముంచేస్తే రిలేషన్లేమిటి లైఫే రిస్కులో పడుతుంది. కాస్త గ్రహించండి.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment