స్నేహమంటే అందమైన Facebook ప్రొఫైల్ picని బట్టి అంకురించేది కాదు

స్నేహమంటే అందమైన Facebook ప్రొఫైల్ picని బట్టి అంకురించేది కాదు.. డీగ్లామరైజ్డ్ picతో అంతరించేదీ కాదూ..

స్నేహమంటే పొద్దున్నే, సాయంత్రం "గుడ్ మార్నింగులు, గుడ్‌నైట్"లు కామన్‌గా కొన్ని వందల మందికి చెప్పేసి.. అందరూ మన వెంటే ఉన్నారని గుంపులో స్నేహితుల్ని కలిపేసేదీ కాదు..

"నీ స్నేహం, ప్రేమదేశం" వంటి సినిమాలు చూసేసి కాసేపు ఎమోషనలైజ్ అయిపోయి ఆ తర్వాత కాజువల్ అయిపోయేదీ కాదు..

అవసరాలకు వాడేసుకోవడాలూ, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగులు చెయ్యడాలూ.. కానే కాదు.

----------------------------

స్నేహం విలువ మనం తీసుకునే శ్వాసకు బాగా తెలుసు.. నిజమైన స్నేహం ఉన్నచోట భరోసా ఉంటుంది.. శ్వాస నిదానిస్తుంది.. గుండెలు విశ్రాంతిగా ఉంటాయి..

ఏ మనిషి మనకు ఉన్నాడనుకుంటే భయాలూ, ఆలోచనలూ, బెంగలన్నీ మాయం అయిపోతాయో ఆ మనిషే స్నేహితుడు. స్నేహంలో ఒకరికొకరు సాయపడుకోవడం ఉంటుంది కానీ అన్యాయం చేసుకోవడం ఉండదు. "ఏమైందిలే" అని స్నేహాన్ని విడిచి మన స్వార్థాన్ని చూసుకోవాలన్న తలంపు మనకు కలుగుతుందో ఆ క్షణమే స్నేహం సమాధి అవుతుంది. అలాంటి స్నేహాల వల్లనే Facebook Friend Requestలకున్నంత అతి ఛీప్ విలువ స్నేహాలకు మిగులుతోంది.

స్నేహం చెయ్యకపోయినా ఫర్లేదు గానీ.. చేస్తే మాత్రం మనస్ఫూర్తిగా చెయ్యండి.. టైమ్‌పాస్ కోసమో... గంటకో మనిషితో గడపడం కోసమో కాదు.. స్నేహాలు! స్నేహమంటే వ్యభిచారం కాదు... కాలక్షేపం కాదు.. ఓ పవిత్రమైన భావన!!

- నల్లమోతు శ్రీధర్
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment