నీకు జ్ఞాపకమున్నా లేకపోయినా......


నీకు జ్ఞాపకమున్నా లేకపోయినా......
నాకెప్పుడూ జ్ఞాపకాలలో నీవు పదిలమే...
నీ కనులతో ఊసులు చెప్పలేదని
బాధతో విలవిలలాడె నా హృదయం
నాకేం తెలుసు అలకతో కలబడే ఆ కళ్ళ నిర్లక్ష్యం
నన్నింతగా గాయపరుస్తుందని తెలియలేదిన్నాళ్ళు!

నిన్ను సంతోషపర్చాలని నేను చేసే పనులు
నీకు సంతోషాన్ని కలిగించినా లేకున్నా...
నా ప్రయత్నాన్ని చూసి మురిసిన
నిన్ను చూసి నా ఆనందానికి అవధులులేవు..!
నింగిని తాకలేనని తెలిసీ నేను చేసే ప్రయత్నాలకు
అప్రయత్నంగా నవ్వుతూ ...
నింగిని చేరినా చేరకున్నా నా మనసుని చేరావు .
అందులో నీవెప్పుడూ పదిలమే అన్న నీ మాటలు నాకెన్నటికీ జ్ఞాపకమే!
@తులసి
Source : Madhu.chowdary 

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment