ఒంటరిగా నా పయనం
ఊహలతో రాయబారం
ఊసులతో నా స్నేహం
గాలి పాడే గీతం
పూవులు తెచ్చే సందేశం
మనసును తాకిన పరిళం
యెదనే మీటిన సంగీతం
హృదిలయల స్వర విన్యాసం
మదిని రేగినా చిరు ప్రళయం
అనుభవించినా ఆ భావం
మనిషిగా నే పెద్దరికం
మనసు మాత్రం పసిప్రాయం
మోముపై విరిసిన దరహాసం
ఉరకలేసే ఉత్సాహం
పూవుల కొమ్మల విలాసం
కొండ వాగులా వయ్యారం
కోనసీమలా సింగారం
నిర్మల నీలాకాశం
సిరి సిరిమువ్వల చిరు లాస్యం
వాన చినుకులా దరహాసం
గడ్డిపూవులా నిర్మలత్వం
మౌనమే నా భాష్యం
కన్నుల్లో నిలచిన నీ రూపం
కనురెప్పల మాటున ప్రపంచం
అంబరాన్నంటిన సంతోషం
ఎల్లలు లేనీ ఆనందం
ప్రతీ నిమిషం ఆస్వాదం
చీకటితో పోరాటం
వెలుగుకోసం ఆరాటం
ప్రతి నిత్యం ఆనందం
మనసు రాసినా కావ్యం
మనిషి పొందినా అనుభవం
ఇదే జీవన గీతం...@తులసి...
Source : https://www.facebook.com/madhu.chowdary
0 comments :
Post a Comment