నువ్వూ నేనూ వేరు కాదే అదేమిటో మనసు మాయ!


మెలకువలో నాతోనే నువ్వు
నిద్దురలో సయితం కలగా వచ్చి తట్టి లేపుతావు
నలుగురిలో సరే సరి...
వదలవుగా నను నిమిషమయినా!
నా ప్రతీ మాటలో నువ్వే
పగలూ రేయీ తేడాలేదే
నువ్వూ నేనూ వేరు కాదే
అదేమిటో మనసు మాయ!
ఎదురుగ నువ్ నిలబడితే
మాటలే తడబడి రావాయె
మౌనమే నా భాషాయె
నీవు దూరమయితే అన్నీ నీ తలపులే
ఏమిటో మరి ఈ మనసు మాయ!
ఎంతకీ తరగని ఊసులాయే
ఎన్నడూ వీడని మనసులాయె
కళ్ళు తెరచి కలల ప్రపంచంలో విహారమాయె
కనుమూస్తే ప్రపంచమే నీవాయె
ఎమయిందో ఏమిటో నా మనసుకి
ఇదేనేమో ప్రేమ మాయ!
Source : https://www.facebook.com/madhu.chowdary 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment