కాలం మారినా ..
గతం మరచినా
ఎన్నెన్ని కొత్త హంగులు వచ్చినా
ఎంతటి ఆర్భాటాలు పెల్లుబికినా
ఆనాటి మన రాట్నం
గాంధీ గారి ప్రియ నేస్తం
ఇప్పటికీ విలువను కోల్పోలేదు
కాలానుగుణంగా కాస్త వెనుకబడిందంతే!
ఎప్పుడయినా మండుటెండలో
నూలు చొక్కానో,నూలు చీరనో ధరిస్తే
అప్పుడు తెలుస్తుంది దానికున్న విలువ
అందుకేనేమో కడుపున బిడ్దలు వదిలేసినా
ఈ నూలు రాట్నం మాత్రం తమని వదలకుండా
తమకింత అన్నం పెడుతుందని కాబోలు
ఏ నేత కర్మికులూ తమ వృత్తిని వదిలిపెట్టరు!
వచ్చేది వేసవి కాలం పైగా పెళ్ళిళ్ళు
ఎండలు మండి మనల్ని ఊపిరిసలపనీయవు
అందుకే వీలైనంత మేరకు నూలు దుస్తులు దరిస్తాం...
నేతన్న కుటుంబాలకు అండగా నిలుద్దాం
మన దేశ చరితలో భాగమయిన
చేనేత పరిశ్రమను కాపాడుకుందాం
తొలి అడుగే ఒంటరి ఎప్పుడూ
మనల్ని చూసి మన వెనుక వేల అడుగులు వస్తాయి
తొలి అడుగేద్దామా మరి!..@తులసి..
https://www.facebook.com
నూలు చొక్కానో,నూలు చీరనో ధరిస్తే
అప్పుడు తెలుస్తుంది దానికున్న విలువ
అందుకేనేమో కడుపున బిడ్దలు వదిలేసినా
ఈ నూలు రాట్నం మాత్రం తమని వదలకుండా
తమకింత అన్నం పెడుతుందని కాబోలు
ఏ నేత కర్మికులూ తమ వృత్తిని వదిలిపెట్టరు!
వచ్చేది వేసవి కాలం పైగా పెళ్ళిళ్ళు
ఎండలు మండి మనల్ని ఊపిరిసలపనీయవు
అందుకే వీలైనంత మేరకు నూలు దుస్తులు దరిస్తాం...
నేతన్న కుటుంబాలకు అండగా నిలుద్దాం
మన దేశ చరితలో భాగమయిన
చేనేత పరిశ్రమను కాపాడుకుందాం
తొలి అడుగే ఒంటరి ఎప్పుడూ
మనల్ని చూసి మన వెనుక వేల అడుగులు వస్తాయి
తొలి అడుగేద్దామా మరి!..@తులసి..
https://www.facebook.com
0 comments :
Post a Comment