ఇంకేదో కావాలి...!!

గాఢ నిద్ర అని
నా కళ్ళు భ్రమపడే
కపట నిద్రలో కూడా ఏవో కలలు....

గెలుపు అనే కొండెక్కుతుంటే,
నిరుత్సాహపు తాళ్ళేసి ఎవరో
కిందకు లాగేసినట్టు...
అగాధంలో ఆశల జాడకై
నే వెతుకుతుంటే... ఎవరో
నిరాశల నిప్పులు నాపై పడేసినట్టు...
మరచిపోయిన నవ్వు
పెదాలపైకి పాకుతూ వస్తోంటే,ఎవరో
మధ్యదారిలో 'పంటి'పాతర పాతేసినట్టు...
గుప్పెడే ఉండే గుండెల్లోకి
గుర్తుతెలియని యంత్రాన్నేదో వేసి...ఎవరో,
పిడికెడు కూడాలేని సంతోషాన్ని తోడేస్తున్నట్టు....
అంగుళమైనా ఖాళీ లేకుండా
గాయలమయమైన నా చర్మపు దుప్పట్లోకి, ఎవరో
కత్తులతో కవాతు చేస్తూ దూరేందుకు ప్రయత్నిస్తున్నట్టు.....
అస్పష్టమైన ఆ దృశ్యాలు
నా కళ్ళలోకి బలవంతంగా
మెలకువని చొప్పించాయి...
కళ్ళు తెరవగానే... కలవరం మొదలు...!!
ఎత్తులెన్నో చూసి
ఎక్కడో ఉన్న పాతాళాన్నీ చూసి...
బ్రతుకు బరువు మోయడం
బహుశా కొత్తగా ఏమీ అనిపించనీయకపోవచ్చు...!!
కానీ,
కళ్ళల్లో కిరాయికుండే కన్నీళ్ళు
పెదవులకు వేలాడే ప్లాస్టిక్ నవ్వులు...
అవసరానికి పలకరింపుకొచ్చే 'ఆత్మీయతలు'
స్వార్ధం నిండిన అనురాగాలు...అనుబంధాలు
స్వచ్చత లోపించిన ప్రేమలూ...స్నేహాలు...పరిచయాలూ...
ప్చ్... ఇదికాదు జీవితమంటే...
ఇంకేదో చూడాలి.... ఇంకేదో కావాలి...!!

Source : ఇట్లు మీ శతఘ్ని
-శతఘ్ని...!!
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment