స్వామి వివేకానంద ఒక్కడు చాలు... మనల్ని మార్చడానికి!

మనమూ, సమాజమూ బాగుపడాలంటే గంటల తరబడి ఊకదంపుడు కబుర్లూ, పనికిమాలిన చర్చలూ, ఆర్గ్యుమెంట్లు, విశ్లేషణలూ ఏం అవసరం లేదు.. మనస్సు పెట్టి "స్వామి వివేకానంద" ఏం బోధించారో కొన్ని పుస్తకాలు చదివితే చాలు. ఖచ్చితంగా సమాజం మొత్తం మారుతుంది. మన ఆలోచనాదృక్పధమూ మారుతుంది.
చిన్న వయస్సులోనే శక్తి లేక నిర్వీర్యమైపోతున్న యువతలో వివేకానంద మాటలు వింటే రక్తం ఉరకలెత్తుతుంది. అసలు ఇన్నాళ్లూ తాము బ్రతుకుతున్నదీ ఓ జీవితమేనా అన్పిస్తుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సెషన్లకెళ్లి బయటకు ఒళ్లు విరుకుచుకుని వచ్చి.. తర్వాతి గంటలోనే నడుము ఒంగిపోయే బాపతు జనాలు ఎవరి దగ్గరో వ్యక్తిత్వపు పాఠాలు నేర్చుకోనవసరం లేదు... ఏ రామకృష్ణ మఠానికో వెళ్లి వివేకానంద బోధనలు ఓ సెట్ కొనుక్కుని రోజుకో గంట చదివితే చాలు.. జీవితం ఖచ్చితంగా మారిపోతుంది.
వివేకానంద ఆలోచనలు మనలో చేరితే చిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టించగలుగుతాం. జీవితంలో ఎప్పుడూ బద్ధకంగా బెడ్ మీద పొర్లాడుతూ కాలక్షేపం చెయ్యం. నువ్వంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పడానికి ధైర్యమూ, స్థైర్యమూ, వ్యక్తిత్వమూ నూరిపోసిన గురువు వివేకానంద..
వ్యక్తిగతంగా నేను ప్రపంచంలో గర్వంగా భావించే ఒకే ఒక వ్యక్తి వివేకానంద. నా ప్రవర్తన మీదా, ఆలోచనల మీదా, నడవడిక మీదా ఆ మహానుభావుని ప్రభావం చాలా ఉంటుంది.
జవసత్వాలు ఉడగకముందే ఏదైనా సాధించాలని ఉంటే వివేకానందుని స్ఫూర్తిని నరనరానా నింపుకుని శక్తివంతులుగా మారిపొండి.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా..
Source : Sridhar Nallamothu
- నల్లమోతు శ్రీధర్
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment