నాకు నేను గుర్తుకురాని ప్రపంచం
నన్ను నేను గుర్తుపట్టుకోలేని ప్రపంచం
నాకోసం నేను బ్రతకకూడదు అనిపించే ప్రపంచం..
తన ఒడే ..!!
నన్ను నేను గుర్తుపట్టుకోలేని ప్రపంచం
నాకోసం నేను బ్రతకకూడదు అనిపించే ప్రపంచం..
తన ఒడే ..!!
తన గోటి ముద్రలు
తన గోరు ముద్దలు
తన పెదవి ముద్దులు...
నాకంటూ
మరో ప్రపంచాన్ని సృష్టిస్తాయి..
నాలో ప్రాణాన్ని
పున: ప్రతిష్టిస్తాయి...
మా ఇద్దరి మధ్యన
నిస్తేజంగా పడి ఉన్న
నిశ్శబ్దపు నిమిషాలన్నీ
రెక్కలు కట్టుకుని రేపటి ఉదయంలోకి
ఎగిపోవాలని ఆశపడుతుంటాయి..
ఎక్కడ ఆగిపోవాలో తెలిస్తేనే కదా,
ప్రయాణం పూర్తయినట్టు..
నేనెక్కడ మొదలయ్యానో తెలియదు కానీ
తనలోనే పూర్తవుతాను అని మాత్రం తెలుసు..
భావాలకి అందని బంధంలో
బంధీ అయిపోవడం
ఎప్పుడూ బాగానే ఉంటుంది..
కొన్ని ప్రశ్నలని తట్టుకోగలిగితే చాలు
కలిసిపోవడాలు,
కలిసి -"పోవడాలూ" మాత్రమే మిగులుతాయి ఇక అంతే..!!
-శతఘ్ని...!!
Source & Credits www.facebook.com/vineel81
తన గోరు ముద్దలు
తన పెదవి ముద్దులు...
నాకంటూ
మరో ప్రపంచాన్ని సృష్టిస్తాయి..
నాలో ప్రాణాన్ని
పున: ప్రతిష్టిస్తాయి...
మా ఇద్దరి మధ్యన
నిస్తేజంగా పడి ఉన్న
నిశ్శబ్దపు నిమిషాలన్నీ
రెక్కలు కట్టుకుని రేపటి ఉదయంలోకి
ఎగిపోవాలని ఆశపడుతుంటాయి..
ఎక్కడ ఆగిపోవాలో తెలిస్తేనే కదా,
ప్రయాణం పూర్తయినట్టు..
నేనెక్కడ మొదలయ్యానో తెలియదు కానీ
తనలోనే పూర్తవుతాను అని మాత్రం తెలుసు..
భావాలకి అందని బంధంలో
బంధీ అయిపోవడం
ఎప్పుడూ బాగానే ఉంటుంది..
కొన్ని ప్రశ్నలని తట్టుకోగలిగితే చాలు
కలిసిపోవడాలు,
కలిసి -"పోవడాలూ" మాత్రమే మిగులుతాయి ఇక అంతే..!!
-శతఘ్ని...!!
Source & Credits www.facebook.com/vineel81
0 comments :
Post a Comment