నన్ను నేను ఎందుకు ప్రమోట్ చేసుకుంటానంటే..? smile emoticon మంచి ట్రేడ్ సీక్రెట్ Must Read

ప్రతీ లైఫ్‌కీ ఓ విలువ ఉంటుంది.. ముఖ్యంగా లైఫ్‌లో చాలా కష్టపడే వాళ్ల జీవితాలకు ఆ విలువ ఎక్కువ ఉంటుంది. ఆ విలువ చాలాసార్లు గుర్తించబడదు..
తరాల తరబడి మన కష్టాన్ని పక్కోళ్లు చాలా అడ్మైరింగ్‌గా చూసి... వాళ్ల నోటితో మన గురించి చెప్తే "అది చాలా గొప్పదనంగా" భావిస్తూ పులకించిపోయాం.
ఇప్పటికీ చాలామందిమి మనల్ని సొసైటీ accept చేస్తోందా, admire చేస్తోందా అన్న దాని మీదే ఫోకస్ చేస్తూ సొసైటీకి నచ్చేలా ప్రయత్నించడానికి పనికిమాలిన ప్రయత్నాలన్నీ చేస్తూ కూర్చుంటాం.
ఇవ్వాళ రేపు ఎవరూ పక్కోడిని ఎంకరేజ్ చెయ్యడమో, మార్కెట్ చెయ్యడమో జరగదు.. అలా జరగాలని ఆశించడం కూడా తప్పే. ఎవరి బిజీలు వారివి, మనల్నీ, మన కష్టాన్నీ observe చేస్తూ మన గురించి నాలుగు మాటలు మంచిగా మాట్లాడుకునే తీరికా, ఓపికా ఏ కోశానా ఉండవు.
---------------------
1996 నుండి 2005 వరకూ నేను ఇలాంటి భావజాలంలోనే ఇరుక్కుపోయాను. IASలు, గవర్నమెంట్ హైయ్యర్ అఫీషియల్స్, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులూ ఎంతమందో నన్ను పర్సనల్‌గా వచ్చి కలిశారు, తరచూ ఫోన్లలో అభినందించేవారు. ఏరోజూ నేను ఎవరి కాంటాక్ట్ కనీసం సేవ్ కూడా చేసుకోలేదు.
"నా పనేదో నేను చేస్తున్నాను.. మిగతా అంతా నాకు సంబంధం లేని విషయం.." అన్న నా ఒరిజినల్ ఏటిట్యూడ్‌కి తగ్గట్లే ఉండిపోయాను. సో ఆ 9 ఏళ్లూ నేనెంత కష్టపడినా ఆ కష్టం ఎలాంటి గుర్తింపునీ తీసుకురాలేదు. నాకు గుర్తింపు పట్ల ఆశ కూడా ఉండేది కాదు. వాస్తవానికి ఇప్పుడూ లేదు. కానీ నాబోటి వాడు మరింత మందికి సర్వీస్ చెయ్యడానికి గుర్తింపు చాలా అవసరం అని తెలుసుకున్నాను.
సో 2005 నుండి 2007 వరకూ నా లైఫ్ లో చాలా చీకటి రోజులు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్లా, ఇతరత్రా కారణాల వల్ల! 2007 నుండి నా విశ్వరూపం ప్రదర్శించడం మొదలెట్టాను. మునుపటికన్నా ఎక్కువ కష్టపడడం.. నా కష్టాన్ని దాచుకోకుండా virtual platformsలో ప్రదర్శించుకోవడం!
నాకు ఇందులో తప్పేమీ కన్పించలేదు.. పనేమీ చెయ్యకుండా సోది కబుర్లు చెప్పుకునే వారు వాళ్లని వాళ్లు ప్రమోట్ చేసుకోగా లేనిది కసిదీరా కష్టపడే వాడినీ, రాత్రింబవళ్లూ కొత్తవి నేర్చుకుంటూ అందరికీ నేర్పించే వాడినీ.. నా గురించి నేను ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి?
"అసలు నేను ఒకడిని ఉన్నాను" అన్న విషయం తెలిస్తేనే కదా "తెలుగు వారందరికీ టెక్నాలజీ మారుమూలలకూ చేర్చాలి" అన్న నా లక్ష్యం నెరవేరేది!
"నేను ఫలానా పని చేశాను" అని మనకు మనం చెప్పుకోందే ఎవరూ గుర్తించరు.. చెప్పుకోవడానికి సిగ్గూ, నామోషీ పడాల్సిన పనిలేదు. అలా నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోపోయి ఉంటే ఈరోజు "1996లో తెలుగులో సాంకేతిక సాహిత్యం మొదటిసారి పరిచయం చేసిన వ్యక్తి"గా నేను నిలిచేవాడిని కూడా కాదు. ఓ పని నిజాయితీగా చేసినప్పుడు సమాజం ముందు గర్వంగా దాని గురించి చెప్పుకోవడానికి ధైర్యం కావాలి.
ఎవరో ఏదో అనుకుంటారనో, స్వోత్కర్ష అనుకుంటారనో, సెల్ఫ్ పబ్లిసిటీ అనుకుంటారనో... పనికిమాలిన ఫీలింగులు ఏమీ అవసరం లేదు. మన నిద్రలు మానేసి కష్టపడుతూ కూర్చుంటే ఎవడూ వాడి పనులు మానుకుని వచ్చి మన మెడలో మెడల్స్ వేయడు. మన కష్టం ఎవరికీ అవసరం లేదు, మన కష్టం ద్వారా వచ్చే ఫలితమే అందరూ ఎంజాయ్ చేసేది. అందుకే మన కష్టాన్ని మనం గాక ఎవరు హైలైట్ చేస్తారు?
సో ఎవరో మనల్ని హీరోయిస్టిక్‌గా చూడాలనీ, చూస్తారనీ జీవితాంతం వేచి చూస్తూ.. నిజంగా కష్టపడడం మానేసి, వాళ్లకి ఎలా నచ్చుతామో అలా ప్రవర్తిస్తూ వాళ్లు కాసేపు పొగిడితే పొంగిపోతూ ఆర్టిఫీషియల్‌గా బ్రతకాల్సిన పనిలేదు. చేసే పనీ, చేసే కష్టం నిజాయితీతో చేయండి.. వెధవ మొహమాటాలు ఏమీ లేకుండా కాల్గెట్ కంపెనీ తన టూత్ పేస్ట్‌ని ఎలా ప్రమోట్ చేసుకుంటుందో అలా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి.
"మీ గురించి ఇంకొకరు చెప్పాలి.. మీరు చెప్పుకోకూడదు" అని నసిగే వాళ్లనీ, నీలిగే వాళ్లనీ ఒక్క నవ్వుతో పక్కన పెట్టేయండి. అలా ఎవడైనా మాట్లాడుతున్నాడూ అంటే వాడు మన ఎదుగుదలని ఓర్వలేకపోతున్నాడూ అనే అర్థం.
దర్జాగా బ్రతకడమే... ఎవరి ప్రాపకమూ, ఎవరి acceptance అవసరం లేదు. మనం ఓ ప్రోడక్ట్ అయినప్పుడు ఒక చోట కాకపోతే మరో చోట మార్కెట్ ఉంటుంది.. అంతే తప్పించి కష్టానికి ఫలితం లేకుండా అంటూ ఏమీ ఉండదు.
సో ఎలాంటి మానసికమైన బారియర్స్ లేకుండా లైఫ్ నచ్చిన విధంగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్


- నల్లమోతు శ్రీధర్
Source : Sridhar Nallamothu
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment