ఈ ప్రయాణం ఎందుకో...?
తనతో జతపడలేని నా మనసుకు,
ఈ ప్రయాస దేనికో.....?
కలనైనా తనని చూడలేని నా కనులకు,
ఈ నిదుర ఎందుకో?
అసలు నేనెందుకో....నాకీ బ్రతుకెందుకో?
వేధించే వేల ప్రశ్నలకు...
తన చిరునవ్వొకటే సమాధానం....
వేరు చేసే దూరం నను చూసి,
చేస్తోంది పరిహాసం.......
తీరం దరి చేరను పొమ్మంటూంటే,
ప్రయాణం ఆపవలసిందేగా.....
తను రాదని తెలిసి అల్లాడే ప్రాణం,
ఇక చాలు అంటుంటే....
ఊపిరాగవలసిందేగా.....!
నాకు తను దక్కదు అని తెలిసినప్పుడు,
నాకు నేనైనా దక్కేనా?
ఈ జన్మకి ఇంతే అనుకోవాలి...
మరుజన్మలోనైనా తన మనసు మారునని ఆశపడాలి...
ఏ జన్మలోనైనా ఈ వెలితి ఇంతే ఉంటుందని నాకు తెలుసు...
ఈ విషయం తనకీ తెలుసు.....
అయినా ఎందుకని ఈ ఆరాటం?
పిచ్చి మనసు...పిచ్చి ప్రేమ.....చ..!
Read more at : www.facebook.com/vineel81
0 comments :
Post a Comment