వెలుగుపంచ మింటికి....
నువ్వొక్కదానివే వెలుగు,
నా ఎద చీకటింటికి.....
నీ తలపు నుండి నను దూరం చేసే,
నిదురను నిందించాలో...
స్వప్నంగా నిను తిరిగి తెస్తుందని,
లోలో ఆనందించాలో...
తెలియక సతమతమవుతున్నా....
నీ తలపు తీపి బాధ నాకు...
స్వప్నంలో మురిపించే నువ్వు,
ఒక తీపి అబద్ధం......
నువ్వు వస్తావన్న ఆశ,
రావేమో అన్న బెంగతో భాగించబడి...
రాకపోతే అన్నభయం 'ఒకటి' గా మిగిలింది....
'అనంతం' అనబడే నువ్వొచ్చి,
ఆ ఒకటితో గుణించబడాలి అన్న ఆకాంక్షతో
నీకై ఎదురుచూస్తూ................నీ నేను.
Read More at : www.facebook.com/vineel81
0 comments :
Post a Comment