ఇది ఏ ఒక్క మతంకో సంబంధించింది కాదని మనవి

ఒక పల్లెటూర్లో ఒక మతప్రచారకుడు ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు...
మా మతంలో చేరితే రోగాలు రావు, మా మతంలో చేరితే సమస్యలు ఉండవు, మా మతంలో చేరితే పాపాలు ఉండవు.....
అది వింటున్న వారిలోంచి ఒక యువకుడు లేచి..అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. దానికి ఆ ప్రచారకుడు భేషుగ్గా అడగొచ్చు అని చెప్పాడు. దానికి యువకుడు మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని అడిగాడు. దానికి ప్రచారకుడు నవ్వి ప్రశ్న అంటే ఎంత కఠినమైంది అడుగుతావో అనుకున్నా మరీ ఇంత సులువైన ప్రశ్ననా అని నన్ను భగవంతుడు సృష్టించాడు అని సమాధానం చెప్పాడు. మరి నన్నెవరు సృష్టించారు..యువకుడు మళ్లీ ప్రశ్నించాడు. నన్ను, నిన్నే కాదు బాబు ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని దేవుడే సృష్టించాడు..సమాధానం చెప్పాడు ఆ ప్రచారకుడు. మన అందరినీ దేవుడే సృష్టించాడు అంటారు. యువకుడు మళ్లీ అడిగాడు.. అవును బాబు కొంచెం అసహనంగా ఆ ప్రచారకుడు సమాధానం చెప్పాడు. అలాంటప్పుడు మనం అందరం ఒకే మతం కదండీ మళ్లీ మీ మతంలో చేరమంటారేంటీ అని అడిగాడు ఆ యువకుడు..సమాధానం చెప్పలేక ఆ మతప్రచారకుడు తల దించుకున్నాడు. మతం అనేది దేవుడికి మనం మనకు నచ్చిన పద్ధతిలో కృతజ్ఞత చెప్పే పద్ధతి. ఎవరి ప్రాంతం, సమాజం, ఆచార వ్యవహారాల ప్రకారం ఆయా మతాలు ఏర్పడ్డాయి. ఏ మతం అయినా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు సులువుగా ఉండేలా ప్రజలను వారి జీవన విధానంలో కలిసి పోయాలా ఉండేలా ఏర్పడింది. ఏ మతం అయినా ఆ ప్రాంతానికి, సమాజానికి అందుబాటుగా, మేలు చేసేవిధంగా ఉంటే సరిపోతుంది. ఆ మతం ప్రపంచం అంతటా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే ప్రయోజనం కూడా లేదు. మీకు ఉన్న జ్ఞానం నలుగురికి ఉపయోగపడేలా చూడండి తప్ప ఇలా వ్యర్థప్రచారాలకొరకు దాన్ని వాడకండి అని చెప్పి ఆ యువకుడు తన మాటల్ని ముగించాడు. తప్పు తెలుసుకున్న ప్రచారకుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
(ఇది ఏ ఒక్క మతంకో సంబంధించింది కాదని మనవి)


SanthoshKumar Sharma Gollapelli
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment