ఓ తులసి కథ ...(పార్ట్-3)

ఓ తులసి కథ ...(పార్ట్-3)

హలో తులసి గారున్నారా ? నేనే మాట్లాడుతున్నాను చెప్పండి

నేను మేడం, ఆఫీసునుండి మాట్లాడుతున్నాను. సర్ కి కొంచెం హెల్త్ బాగోలేదు, మన కంపెనీ హాస్పిటల్ లో జాయిన్ చేసాం మీరు త్వరగారండి.

ఏం జరిగింది? కాస్త కంగారు పడుతూనే అడిగాను.

నాట్ సీరియస్ మేడం, కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఫస్ట్ మీరు రండి.

కంగారు పడుతూ హాస్పిటల్ కి వెళ్లిన నాకు నాకోసమే ఎదురు చూస్తున్న ఈయన బెడ్ మీద కనపడ్డారు. కొన్ని క్షణాలు ఊపిరి పీల్చుకున్నాను హమ్మయ్యా ఏమి కాలేదు అనుకుంటూ. ఆయన కళ్ళు చూస్తే చాలా పచ్చగా కనపడుతున్నాయ్.ఏదో చెప్పాలనుకుంటున్నారు కాని మాట్లాడలేకపోతున్నారు.
పక్కన కూర్చుని తల నిమురుతూ ఏదైనా కావాలా, వాటర్ తాగుతారా? అని అడుగుతున్నాను కాని తన మొహంలో నవ్వు తప్ప ఏమి మాట్లాడలేక పోతున్నారు.

ఇంతలో డాక్టర్ వచ్చి మీరేనా శ్రీనివాస్ మిసెస్ అంటూ నన్ను బయటకి రమ్మన్నారు,.చూడండి తులసి మీ హస్బెండ్ ఆల్కహాల్ ఎక్కువగా త్రాగుతున్నారా ?

అవునండి చాలా హెవీ గానే డ్రింక్ చేస్తారు, మానాలని అనుకుంటున్నారు కాని ఆయన వల్ల కావట్లేదు.

Mrs శ్రీనివాస్ మీకు తెలుసో లేదో ఈ విషయం, మీ హస్బెండ్ మారేజ్ కి ముందు హెవీ డ్రింకింగ్ వల్ల ఈ హాస్పిటల్ లోనే అడ్మిట్ అయ్యారు. ట్రీట్మెంట్ చేసింది కూడా నేనే.ఇంకో సారిలా సివియర్ డ్రింక్ చేస్తే లివర్ డామేజ్ అయ్యే ప్రాబ్లం ఉందని వార్నింగ్ చేసి పంపాను. మళ్ళీ ఇది సెకండ్ టైం ఇలా అడ్మిట్ అవ్వడం. టెస్ట్లులు చేసిన తరువాతగాని ఏ విషయం చెప్పలేము, ధైర్యంగా వుండండి, ఎవరిథింగ్ విల్ బి ఒకే అంటూ వెళ్ళిపోయాడు .

ఎందుకో డాక్టర్ మాటలు నాకు ఆర్టిఫీషియల్ గా తోచాయి. తన భర్త తన దగ్గర దాచిన విషయాల్లో ఇది కూడా ఒకటి కాని నా సహనానికి మరో పరీక్ష. దేవుడు ఏం చేయదలుచుకున్నాడో అనుకుంటూ ఆయన ఉన్న రూంలోకి వెళ్ళిపోయాను.

నాకేపాపం తెలీదన్నట్టు ప్రశాంతంగా పడుకుని ఉన్న ఈయన్ని చూస్తే ఒకేసారి నవ్వు జాలి రెండూ కలుగుతున్నాయి.నా బాధని ఎవరితోనైనా పంచుకోవాలని ఉంది, అందరూ తెలిసున్నవారే ఈరోజు నా ఈ పరిస్థితికి అందరూ కారణమే. ఎవ్వరితో చెప్పుకోవాలి ? నా మౌనాన్ని డిస్టర్బ్ చేస్తూ నర్స్ వచ్చింది.

టేబుల్ మీద టాబ్లెట్స్ పెట్టి వేయమని చెప్పి వెళ్ళిపోయింది.

ఈయన లేస్తే టాబ్లెట్స్ వేద్దామని అయన కేసి చూస్తూ కూర్చున్నాను.

"తులసి పాప ఎక్కడా?" ఒక్కసారి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నన్ను తాకిన మాట. ఈయన కళ్ళల్లో స్పష్టంగా కనపడుతూంది పాపని చూడాలనే ఆతృత. ఒక్క క్షణం ఇంతవరకు తాను కోల్పోయిన జీవితం ఆయన కళ్ళల్లో చూస్తున్నాను. ఇప్పుడు తనకి పాప కావాలి నేను కావాలి. మా ఇద్దరికీ తిను కావాలి. విధికి మాతో ఆడుకోవడం కావాలి.

ఏదైతే జరక్కూడదు అనుకున్నానో అదే జరిగింది. డాక్టర్ మా మామగారితో అంటున్న మాటలు వినపడుతున్నాయి. లివర్ కాన్సర్ సివియర్ స్టేజ్ లో ఉంది. ఇంటికి తీసుకెళ్ళి ప్రశాతంగా చూసుకోండి, చేయగలిగిందేమీలేదు. దుఖం తన్నుకొస్తూంది, వెక్కి వెక్కి ఏడవాలని ఉంది. ఒక్కసారి నాన్నగుర్తొచ్చాడు, చదువుకుంటాను నాన్న పెళ్లి చేయొద్దంటే నా మాట వినలేదు. ఇప్పుడు గమ్యం లేని జీవితాన్ని ఒంటరిగా చదువుకోమని దిక్కేలేని దారుల్లో ఒదిలేసినట్టుంది నా పరిస్థితి.

జీవితంలో మొదటిసారి ఆయన మా ఇద్దరితోటి ప్రేమగా ఉంటున్నారు. తను మాట్లాడే ప్రతి మాటలో మీరు నాకు కావాలి, నేను బ్రతకాలి అని విధిని బ్రతిమాలుతున్నట్లు ఉంది. ఆయన నాకు దక్కరని తెలుసు. రోజురోజుకి మా మధ్య పెరుగుతున్న ప్రేమ ఒక ప్రక్క, తరుగుతున్న ఆయుష్షు ఒక ప్రక్క. మేమిద్దరం మనసుతో గడిపిన మధుర క్షణాలు ఇవే, తడి ఆరని కళ్ళలో కుమిలిపోతున్న రోజులూ ఇవే . విధి ఆడే ఆట ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే. చూస్తూ చూస్తూ మూడు నెలలు గడిచి పోయాయి . నాకున్న సహనానికి ఇప్పుడు ఒంటరితనం కూడా తోడయ్యింది . మనం ఏదైతే కావాలనుకుంటామో దానిని దూరం చేస్తాడు దేవుడు. తన జ్ఞాపకంగా పాపని , మా ఇద్దరి బ్రతుకు తెరువుకు లోటు లేకుండా ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి శాశ్వతంగా మాకు దూరమైయ్యారు.

బుగ్గ మీద వెచ్చటి ముద్దు ...అమ్మా! అమ్మా! అంటూ హరిత పిలుపు చెవులని తాకడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. టైం చూస్తే మార్నింగ్ 7. గడచిన కాలమంతా వేదనై రాత్రి నా కళ్ళలో కరిగిపోయింది, చాలా కాలం తరువాత గతం గుర్తులు మనసుని గుచ్చుతూ నిద్రలేని రాత్రే గడిపాను . హడావుడిగా పాపని రెడీ చేసి స్కూల్లో దింపి, నేను ఆఫీసుకి బయలుదేరాను.

"గుడ్ మార్నింగ్ తులసీ ఎలా వున్నావ్" బావున్నాను అని కళ్ళతోనే సమాధానం చెప్పాను కావ్యకి.
కావ్య నాతో పాటు గత 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న కొలీగ్, నా సంతోషాన్ని , బాధనీ పంచుకుని ఓదార్పు నిచ్చే ఒకే ఒక్క స్నేహితురాలు కావ్య.

నా ఒంటరితనం నాకు ఎలాగు అలవాటయ్యింది, ఎందుకొచ్చిన ఈ కొత్త బంధాల కోసం వెంపర్లాట అనుకుంటూ నా పనిలో నేను లీనమయ్యాను. ఇంతలో హలో యు గాట్ అ మెసేజ్ అంటూ మొబైల్ ఇన్బాక్స్ లోంచి చిన్న సందేశం 

బహుదూరపు బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment