ఇంటి వైద్యం............

ఇంటి వైద్యం............

వర్షాకాలంలో వాతావరణ పరిస్థితుల ప్రభావం మూలంగా ప్రతి ఇంట్లో వచ్చే సాధారణ సమస్య దగ్గు, జలుబులు. అందులో చిన్న పిల్లల్లో దగ్గు, జలుబులు సులువుగా పాకుతాయి.ఇటువంటి దగ్గు, జలుబులకు ఇంట్లోనే ఉపశమనాన్నిచ్చే కొన్ని పద్దతులు.

(జలుబు చేస్తే).......

- వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు మాయం.

- పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి.

- ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.

- తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.

- శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.

- ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.

- ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
నాలుగు తులసి ఆకుల రసమ్ తాగాలి.

- శరీరంలో వేడి చేయడం వల్ల వచ్చే జలుబు పోవాలంటే కొబ్బరి నీరు తాగాలి

- వేడి నీటిలో అల్లం ముక్కలు ఉడకపెట్టి కొద్దిగా చక్కెర వేసుకుని వడకట్టుకుని వేడిగా తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

- తుమ్ములు ఆగకుండా వెంట వెంటనే వస్తూవుంటే, కొత్తిమీరి గానీ, గంధం పొడిని గానీ వాసన చూస్తూ వుంటే వెంటనే తుమ్ములు ఆగింపోతాయ్.

(దగ్గు వస్తే)........

- దగ్గుకి మంచి మందు క్యాబేజీ. క్యాబేజీ ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని నేరుగా తాగలేకపోతె చిటికెడు పంచదార కలుపుకోవచ్చు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకోవచ్చు.
దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబట్టి పడుకోబోయేముందు ఒకసారి తప్పకుండా తాగాలి.

- కరక్కాయ. రాత్రిళ్ళు బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.

- ధనియాలు, మిరియాలు మరియు అల్లంను కషాయంగా చేసి తాగితే కూడా దగ్గు తగ్గుతుంది,లవంగం బుగ్గన పెట్టుకున్నాదగ్గు తగ్గుతుంది.

- అలాగే పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ వేసుకుని తినడం వల్ల దగ్గు తగ్గుతుంది.

- తేనెలో అల్లం కలుపుకుని రోజుకు మూడు, నాలుగు సార్లు తింటే దగ్గు మాయమవుతుంది.

దగ్గు, జలుబు వాళ్ళ వచ్చే గొంతునొప్పి పోవాలంటే పావుస్పూను మిరియాలపొడిని తేనెతో కలిపి వారం రోజులు తీసుకోవాలి.

శొంఠి 40 గ్రాములు తీసుకుని దానిని నాలుగు రెట్లు నీటితో కలిపి నాల్గవ వంతు కషాయం మిగిలేటట్లు మరిగించి, వడపోసి చల్లర్చి అందులో తగుమాత్రంగా తేనె కలిపి కొద్ది కొద్దిగా సేవిస్తూ వుంటే దుష్టజల సంయోగం వల్ల కలిగిన జ్వరం, అరుచి, అగ్నిమాంద్యం, దగ్గు, పడిశం, జలదోషం వీనిని హరింపచేసి శరీరానికి, మనసుకు, నేత్రములకు నిర్మలత్వాన్ని ప్రసన్నతను కలుగచేస్తుంది.
Photo: ఇంటి వైద్యం............ 

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment