FB వాడే వాళ్లు ఒక్కసారి చదవండి..

ఎందుకు వాడుతున్నామో, ఎలా వాడాలో సరైన క్లారిటీ లేకపోతే Facebook మన జీవితం మొత్తాన్నీ ఎందుకూ పనికిరాకుండా చేసేస్తుంది.
Facebook అకౌంట్ ఓపెన్ చెయ్యబోయే ముందే ఆలోచించుకోవాలి అన్ని విషయాలు. తీరా పీకల్లోతు FB వ్యసనంలోకి కూరుకుపోయాక అన్నీ కరెక్టే అన్పిస్తాయి.
ఈరోజు కెరీర్లు వదిలేసి గంటల తరబడి FBలో పాలిటిక్స్, సినిమా హీరోల గురించి ఎట్రాక్టివ్ ఫొటోలు ఫొటోషాప్‌లో తయారు చేసి.. వచ్చే కామెంట్లకీ, shares, likesకి పులకించిపోయే జనాల్ని చూస్తూనే ఉన్నాం. వయస్సైపోయీ చెయ్యడానికి వేరే ఏ పనీ లేనప్పుడు టైమ్‌పాస్‌కి ఇలాంటివి చేసినా ఓ అర్థముంటుంది.. బంగారం లాంటి కెరీర్, చదువు పక్కనబెట్టి ఇలా టైమ్‌పాస్ చెయ్యడం వల్ల ఎవరి లైఫ్ పాడవుతుంది?
స్టూడెంట్లే కాదు... ప్రతీ ఒక్కరూ.. ఎవరి స్థాయిలో వాళ్లు ఏదో రూపంలో చేయాల్సిన అన్ని ముఖ్యమైన పనుల్నీ పక్కనపడేసి Facebookలో గడిపేయడం అలవాటైపోయింది. ఒక్కసారి మీకు మీరు విశ్లేషించుకోండి.. FB వాడకముందు మీ పనులన్నీ ఎంత ప్రశాంతంగా అయ్యేవో.. ఇప్పుడెలా లేట్ అవుతున్నాయో?
Facebookలో మనకున్న 100, 200 మంది ఫ్రెండ్స్ "వాస్తవం" అని భావిస్తున్నాం. వాళ్లని విడిచి పనిచేసుకోవాలన్నా మనసొప్పదు. తప్పనసరై ఓ నాలుగు రోజులు అందుబాటులో లేకపోతే "ఈ నాలుగు రోజులు మీకు అందుబాటులో ఉండను" అని statusలు పెట్టేస్తాం. అది చదివి ఆ 100, 200 మందిలో గట్టిగా ఓ 20 మంది నవ్వేసుకుంటారు కూడా! వాళ్లు మిమ్మల్ని మిస్ అవుతున్నారో, మీరు వాళ్లని మిస్ అవుతున్నారో అర్థం కాదు. వర్చ్యువల్ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తీ వాస్తవం కాదు, ఒట్టి భ్రమ. వాళ్లు likes ద్వారా, కామెంట్ల ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నంత మాత్రాన రియల్ లైఫ్‌ని వదిలేసి వాళ్ల గురించే రోజంతా ఆలోచించమని కాదు.
మనకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఓ platformని ఏ పర్పస్‌కి వాడాలనుకుంటున్నామో ఆ పర్పస్‌కి మాత్రమే వాడాలి. నా వరకూ నేను టెక్నాలజీ, హ్యూమన్ రిలేషన్లు, మిత్రులకు ఆసక్తి ఉండే కొన్ని నా పర్సనల్ విషయాలూ షేర్ చేసుకోవడానికి మాత్రమే Facebookని వాడాలని మొదట్లో నిర్ణయించుకున్నాను. ఇప్పటివరకూ శృతిమించి ఎప్పుడూ ప్రవర్తించలేదు.
నా దృష్టిలో Facebook చాలా పవర్‌ఫుల్ టూల్. టెక్నాలజీనీ, హ్యమన్ రిలేషన్లనీ తెలుగు వారికి తెలియజెప్పడానికి నేను Facebookని నాకు చేతనైనంత మేరకు చాలా ఎఫెక్టి‌‌వ్‌గా వాడగలిగాను అన్న సంతృప్తి ఉంది. ఏరోజూ నాకు Facebook డీఏక్టివేట్ చెయ్యాలన్పించలేదు, అవసరాన్ని మించి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నానన్పించలేదు. నేను స్పెండ్ చేసే ప్రతీ సెకండ్ పర్పస్‌ఫుల్‌గా యూజ్ చేసుకుని మిగతా పనులు చేసుకుంటూ ఉంటాను.
మనలో ప్రతీ ఒక్కరికీ ఓ timeline ఉంటుంది. ఒక్కసారి వెనక్కి స్క్రోల్ చేసి చూడండి.. అది మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉందా.. ఇతరులకు ఉపయోగపడేలా ఉందా... కనీసం కొంతైనా పర్పస్ గానీ, అర్థం గానీ ఉందా అని గమనించండి. రబ్బిష్‌గా మీ timeline ఉంటే వర్చ్యువల్‌గా మీ విలువను మీరు కోల్పోయినట్లే!
Source : Sridhar Nallamothu
- నల్లమోతు శ్రీధర్
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment