ప్రతీ క్షణం కొత్తగా..

ప్రతీ క్షణం కొత్తగా..
___________
ప్రతీ క్షణం ఇప్పుడే పూర్తయిన క్షణం యొక్క థాట్స్ నుండి రూపం సంతరించుకుంటుంది..
ఫిజిక్స్ తెలిసిన వాళ్లకు అణు నిర్మాణం (cell architecture) తెలిసే ఉంటుంది. ప్రతీ కణం ఒకదానితో ఒకటి ఏదో ఒక రూపంలో interlinked అయి ఉంటుంది. సరిగ్గా అలాగే ఈ సెకన్ మనం చేసే ఆలోచన ఎక్కువగా క్రిందటి సెకండ్ నుండి ఇన్‌ప్లుయెన్స్ అవుతుందన్నమాట.
అందుకే మనం ఆలోచనల్లో డీప్‌గా కూరుకుపోతుంటాం. ఒక ఆలోచనలోకి వెళ్లగానే తెలీకుండానే దానిలోనే నిముషాలూ, గంటలూ, రోజులూ గడిపేస్తూ ఉండిపోతాం. అసలు మనం ఒక థాట్‌లో ఇరుక్కుపోయామన్న స్పృహ కూడా ఉండదు. మన లక్ బాగుండి దానికన్నా పవర్‌ఫుల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఆలోచన దానివైపు మళ్లితే తప్పించి మనం సాధ్యమైనంత వరకూ ఒకచోట ఇరుక్కుపోతూ కూర్చుండిపోతాం.
మనం ఎఫెక్టివ్‌గా లేమంటే, మనం విచారంగా ఉంటున్నామంటే, జీవితంలో ఏదో కోల్పోయినట్లు, పోగొట్టుకున్నట్లు బాధపడిపోతున్నామంటే.. ఇలా ఆలోచనల ద్వారా మనం మోసుకొస్తున్న జ్ఞాపకాల వల్లనే!
జీవితం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. ప్రతీ క్షణం కొత్తగా ఆలోచించడం మొదలెట్టాలి. అయిపోయిన క్షణం ఎలాంటి ఎమోషన్‌ని మిగిల్చినా దాంతో మనకు పని ఉండకూడదు. పాత జ్ఞాపకాలూ, వాటి ద్వారా పుట్టుకొచ్చే ఎమోషన్లు ప్రస్తుతాన్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తాయి.
ఎవరైనా కోప్పడ్డారంటే, మనస్సు కష్టపెట్టారంటే, ఇగోని హర్ట్ చేశారంటే, అన్యాయం చేశారంటే, నమ్మకద్రోహం చేశారంటే అది అయిపోయిన ఎపిసోడ్! "అయిపోయిన వాటి గురించి విపరీతంగా ఆలోచించేస్తే భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండొచ్చు" అని భావిస్తూ తెగ చించుకుంటూ ఉంటారు చాలామంది! ఇలా బుర్ర చించుకోవడం వల్ల మిగిలేది బాధ తప్పించి ఏం లేదు.
మనకు పొద్దున్నే లేవగానే అప్పటివరకూ నిద్రలో మర్చిపోయినవన్నీ మెల్లగా గుర్తు తెచ్చుకోవడం అలవాటు. మెల్లగా నిన్నా, మొన్నా, అటు మొన్నా, ఏడాది క్రితమూ, కొన్నేళ్ల క్రితమూ జరిగిపోయినవన్నీ సందర్భానుసారం గుర్తుతెచ్చుకుంటూ ఉంటాం. భయపడిపోతూ ఉంటాం. ప్రతీ రోజూనీ కొత్తగా ఆలోచించాలి, కొత్తగా మొదలెట్టాలి, జీవితంలో అస్సలు చెయ్యనివి కూడా చేయడానికి సంతోషంగా ముందుకు రావాలి, అలాగే చేసి ఫెయిల్ అయినవీ మళ్లీ చేసే ధైర్యం కావాలి, మనుషుల్ని చూసి ముడుచుకుపోవడం ఆపేయాలి, కనీసం ఈ క్షణం నుండైనా మనస్ఫూర్తిగా నవ్వడం మొదలెట్టాలి. ఏవైతే భయాలు పేరుకుపోయాయో అన్నీ మైండ్‌లో చెరిపేసి ప్రతీదీ ట్రై చేయాలి.
ఇలా chainsని తెంచుకుని స్వేచ్ఛగా ప్రవర్తించడం ద్వారా జీవితం కొత్తగా కన్పించడం మొదలెడుతుంది. చాలా సంతోషాన్ని మూటగట్టుకోగలుగుతాం, ఇన్నాళ్లూ ఏం కోల్పోయామో అర్థమవుతుంది, అన్నింటికన్నా ముఖ్యంగా పాత చెత్తని మనస్సులో మోసుకు తిరగడం మానేస్తాం.
- నల్లమోతు శ్రీధర్
Sridhar Nallamothu
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment