కాన్ఫిడెన్స్ లెవల్ పెంచుకునే ప్రయత్నం చేయండి.. భయాలన్నీ ఆటోమేటిక్‌గా పోతాయి.

ఫేస్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్ మారనంత మాత్రానా చాలా ధైర్యంగా ఉన్నట్లు కాదు.. మనలో చాలామంది పైకి ధైర్యాన్ని నటిస్తున్నారు.. లోపల హార్ట్ బీట్ మాత్రం పెరిగిపోతుంటుంది.

ఈ జీవితంలో చావుకి మించిన పెద్ద భయం ఏదీ లేదు. చావు గురించి భయం లేని వాళ్లకైతే అస్సలు వేరే భయమంటూ కూడా లేనట్లే. మనం ఊహించుకుంటున్నవన్నీ పనికిమాలిన భయాలు..

ఓ కొత్త మనిషిని నేరుగా ఫేస్ చెయ్యాలంటే భయం.. బెరుకు... ఎవరితోనైనా కళ్లల్లోకి కళ్లు పెట్టి మాట్లాడాలంటే ఒక్క క్షణం కూడా చూపు eye contactలో నిలవదు.. టప్పుమని కనురెప్పలు క్రిందికి వాలిపోతాయి.

అలాగే లోపల పిచ్చి పిరికిగా ఉండే జనాలు పైకి చాలా గంభీరంగా భలే కన్పిస్తుంటారు. చిన్న సౌండ్ వింటే ఉలికిపాటు... పక్క మనిషి గట్టిగా అరిస్తే గుండెలు దడదడలాడతాయి.. ఇవన్నీ weak heart లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఉండడం తప్పు కూడా కాదు. బట్ ఈ లక్షణాలతోనే బిక్కుబిక్కుమంటూ జీవితాంతం బ్రతికేయాల్సిన పనికూడా లేదు.

మనకు ప్రతీదీ ఊహకు అందాలి. ఫలానాది జరగబోతోంది అని ముందే తెలిసి.. దానికి మెంటల్‌గా ప్రిపేర్ అయితే మనకు ఎలాంటి భయమూ ఉండదు. ఊహించరానిది ఏదైనా జరిగితేనే మనకు భయం.. అలా ఊహించరానిది ఏదైనా జరుగుతుందేమోనన్నదే మన జీవిత కాలపు భయం.

ఏం జరుగుతుంది? మీరు కూర్చున్న చోట భూకంపం వచ్చేసి మీరు భూమిలోకి కూరుక్కుపోరు కదా...? అడుగు దూరంలో పది అడుగుల దూరంలో బాంబు పడినా.. చాలా కాజువల్‌గా తీసుకునే ఎమోషనల్ బ్యాలెన్సింగ్ మనకు కావాలి.

జీవితం ఎక్కడికీ పోవట్లేదు.. మనమే.. ఉన్న జీవితాన్ని కేవలం భయం కొద్దీ చాలా బిక్కుబిక్కుమంటూ జీవించేస్తున్నాం. ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నీ మనకెక్కడ జరిగిపోతాయో అని మరికొన్ని లేనిపోని భయాలూ మోసేస్తున్నాం.

భయం ఓ అతి దరిద్రమైన ఎమోషన్. మైండ్‌లో, బాడీ మెటబాలిజమ్‌లో క్షణంలో చాలా మార్పులు తెచ్చే ప్రమాదకరమైన ఎమోషన్. ఆలోచనలు పరుగులెత్తిస్తే భయం విపరీతంగా పెరిగిపోతుంది. ఏ ఆలోచననూ పట్టించుకోవద్దు.. ఏ ఆలోచననూ ప్రాసెస్ చేయొద్దు.. పెరగనీయొద్దు... జస్ట్ ఒక ఆలోచన నుండి దానికి పూర్తి భిన్నమైన ఆలోచనకి టెక్నిక్‌గా మళ్లిపొండి.. Once మన థాట్స్‌ని మన కంట్రోల్‌లోకి తీసుకోగలిగితే చాలు.. చాలా భయాలు దూదిపింజల్లా తేలిపోతాయి.

కాన్ఫిడెన్స్ లెవల్ పెంచుకునే ప్రయత్నం చేయండి.. భయాలన్నీ ఆటోమేటిక్‌గా పోతాయి.

- నల్లమోతు శ్రీధర్

Sridhar Nallamothu
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment