కొన్ని నిజాలు.. తప్పక చదవండి

కొన్ని నిజాలు.. తప్పక చదవండి
_____________________

మనుషుల పట్లా.. మానవత్వం పట్లా నమ్మకం పెంచే విషయాలే నేను రాస్తుంటాను.. కానీ మొదటిసారి మనుషుల పట్ల నమ్మకంతో పాటు చాలా జాగ్రత్తగా కూడా ఉండమని తెలియజేస్తూ ఇది రాస్తున్నాను..

Facebookలో మన చుట్టూ చాలామంది మెంటల్ పేషెంట్లు ఉన్నారు. స్క్రిజోఫీనియా వంటి మానసిక రుగ్మతలతో పాటు ఐడెంటిటీ క్రైసిస్‌లో కొట్టుమిట్టాడే సైక్రియాట్రిక్ పేషెంట్లు వీళ్లంతా.

ఉదా.కు.. ఓ వ్యక్తి.. కొన్నేళ్ల క్రితం నుండి బ్లాగుల్లో రకరకాల అబద్ధాలతో, నకిలీ పేర్లతో చలామణి అయి చాలామందిని మోసం చేసిన వ్యక్తి. తాను ఫిజిక్స్‌లో రీసెర్చ్ చేస్తున్నానంటూ.. విదేశాలు వెళ్తున్నానంటూ.. ఓసారి నేరుగా నన్నూ వచ్చి కలిసి కాసేపు ముచ్చట్లాడిన మనిషి.. ఆ తర్వాత అదే కబుర్లు చెప్తూ చాలామంది దగ్గర మంచితనం కొద్దీ డబ్బు సేకరించి విలాసాలకు వాడుకున్న మనిషి... ముసలి తల్లిదండ్రుల్ని అపురూపంగా చూసుకోవాల్సింది పోయి.. వాళ్ల నాన్నకు వచ్చే పెన్షన్‌లోనూ తన వాటా అడిగి తీసుకుంటూ.. Facebook వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లల్లో అమ్మకు మదర్స్ డేకి సెల్ ఫోన్ కొనిచ్చానని గర్వంగా అబద్ధాలు చెప్పుకు తిరుగుతున్న మనిషి... రకరకాల విచిత్రమైన ఫారినర్ల పేర్లతో తనకి తానే ఫేక్ ప్రొఫైళ్లు మెయింటైన్ చేస్తూ.. ఆ ఫేక్ ప్రొఫైళ్లలో ఉన్న వ్యక్తులు తనకు ఆదర్శం అని ఇతర ప్రొఫైళ్ల ద్వారా తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్న మనిషి..

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చెప్పుకోవాలి.. అలాంటి మనిషిని ఈరోజు నేను కొంతమంది మిత్రుల జ్ఞానబోధ మేరకు బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తి అనేక చోట్ల నా పేరుని తన ఆత్మీయునిగా వాడుకుంటూ... "ఫలానా నల్లమోతు శ్రీధర్ గారే నన్ను ఇష్టపడతారు" అని చెప్పుకుంటూ ఇతర అమాయకుల్ని తాను మేధావిగా చలామణి అవ్వడం కోసం.. తన ఐడెంటిటీని ఎలివేట్ చేసుకోవడం కోసం ప్రయత్నించడం జరుగుతోందట.

సరే ఆ మనిషి సంగతి పక్కనపెడదాం... ఇలాంటి మనుషులు నాకు ఇప్పటివరకూ చాలామందే తారసపడ్డారు. కొద్దో గొప్పో అటూ ఇటూగా!

1. Facebook వంటి వాటిలో ఎవరేమిటో మనం నేరుగా వెళ్లి తేల్చుకునే ప్రయత్నం చెయ్యము. దాంతో ఓ పేరూ, ప్రొఫైల్ తగిలించుకున్న ప్రతీ వ్యక్తీ నాలుగు మంచి మాటలూ, అక్కడక్కడ కామెంట్లు చేస్తూ.. నలుగురిలో మెలమెల్లగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయడం చాలాచోట్ల మీరు గమనించొచ్చు. వాళ్లు మాట్లాడే మాటలు ఎంత వరకూ నిజాలో, వాళ్ల వ్యక్తిత్వం ఎంతవరకూ నిఖార్సయినదో మనం గమనించం. అంతెందుకు నేను పైన చెప్పిన వ్యక్తి చేసే పోస్టులను నా సర్కిల్‌లో ఉన్న పెద్ద పెద్ద మేధావులు కూడా రోజూ like చేస్తున్నారు.. అతని ఏటిట్యూడ్ నిజమైనదని నమ్మి! బట్ యదార్ధంలోకి వెళితే ఆ మనిషి ప్రవర్తనే ఓ అబద్ధం. ఇలాంటి అబద్ధపు మనుషులూ, వ్యక్తిత్వాలూ మీ చుట్టూ ఎన్ని ఉన్నాయో ఆలోచించుకోండి.

2. అందమైన కొటేషన్లు, ఎక్కడో కాపీ చేసుకొచ్చిన మేటర్లూ షేర్ చేసినంత మాత్రాన.. "ఈ మనిషేదో మంచి వ్యక్తిలా ఉన్నారు" అని గుడ్డిగా నమ్మేయకండి. మంచి వ్యక్తులే కాదు... మంచితనం ముసుగు తొడుక్కుని మనుషుల్ని మోసం చెయ్యాలనుకునే వారూ ఇలాంటి మంచి కొటేషన్లే రాస్తుంటారు. కన్పించిన ప్రతీచోటా కామెంట్లు పెట్టి.. చాలా మంచి వాళ్లుగా చలామణి అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.. అందరిలో ఎస్టాబ్లిష్ అవుతారు. సో ఓ వ్యక్తి నిజ జీవితంలో ఎలాంటోడో తెలీనంత వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి.. చివరకు నన్నయినా... కావాలంటే రండి.. ఎప్పుడైనా కలుద్దాం... నేనేంటో మీకు తెలియడానికి ఎన్ని పరీక్షలు చేసుకుంటారో చేసుకోండి. సో ఇలా మనుషుల్ని తెలుసుకోండి తప్పించి గుడ్డిగా నమ్మకండి.

3. అమ్మాయిల్ని పడేయడమే టార్గెట్‌గా ప్రొఫైళ్లు మెయింటైన్ చేస్తున్న వాళ్లు కోకొల్లలు. అలాగే మహిళల్లోనూ కొంతమంది తమ పట్ల అందరూ క్రేజ్ చూపాలని... శృతిమించి ప్రవర్తిస్తున్న వాళ్లెంతమందో! ఈ రెండు వర్గాల జనాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అపోజిట్ సెక్స్‌‌తో కాసేపు టైప్ పాస్ చెయ్యడానికో, పర్సనల్ ఛాట్‌లో రొమాన్స్ చెయ్యడానికో మీరు Facebook లాంటివి వాడుతూ పోతే చాలా విలువైన జీవితం వృధా అయిపోతుంది.. మీకు ఊహించని రిస్కుల బారిన పడతారు. మీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే మీ పేరెంట్స్‌కి చెప్పండి.. ఓ పిల్లని చూసి పెళ్లి చేస్తారు.. మీకు పెళ్లయిందా.. అయితే కన్పించిన ప్రతీ అమ్మాయి వంకా చూడకండి.. మీ వైఫ్ మీతోనే ఉంది.. ఆ విషయం మర్చిపోకండి.. అలాగే అబ్బాయిల నుండి క్రేజ్ కావాలనుకునే వాళ్లకూ విజ్ఞప్తి.. మహిళలు శృతిమించితే ఈ భారతదేశం చాలా పతనం అవుతుంది. కాస్త బాధ్యత ఎరిగి ప్రవర్తించండి.

4. ఇకపోతే Likesలు, కామెంట్లు ఓ పెద్ద ట్రాష్. నాకు వందల likes వచ్చినంత మాత్రాన నేను గొప్ప కాదు... మీకు రానంత మాత్రాన మీరు తక్కువా కాదు. Likes పెంచుకోవడం కోసం, సోషల్ ఐడెంటిటీ ప్రమోట్ చేసుకోవడం కోసం రోజంతా అన్ని పనులూ పక్కన పడేసి, కెరీర్, జాబ్ అన్నీ పక్కన పడేసి.. అందర్నీ వెళ్లి కెలికి.. మీ పలుకుబడి పెంచుకోవాలని కోరుకోకండి. ఇక్కడ కాదు మనుషులు మనల్ని like చెయ్యాల్సింది.. నిజ జీవితంలో ఇష్టపడే మనుుషులు కావాలి మనకు. అప్పుడే జీవితానికి అర్థముంటుంది. ఈ Likes, Comments మాయలో పడి కొట్టుకుపోకండి.. ఇది ఓ అడిక్షన్.

చివరిగా అబద్ధంలో అబద్ధపు బ్రతుకు బ్రతకాలనుకోకండి.. మీ బ్రెయిన్ మిమ్మల్ని ఓ భ్రాంతిలోకి లాగేస్తుంది.. అది మీకు తెలీని మానసిక వ్యాధి.. నిజంలో నిజంగా మీకు మంచి క్వాలిటీలు ఉన్నా, చెడ్డ క్వాలిటీలు ఉన్నా దర్జాగా ఒప్పుకుంటూ బ్రతకండి.. జీవితం బాగుంటుంది.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment