ఓడిపోదాం........రండి....!!
***************************
వెంటనే చేయాలి అనే "కసి" మెడ విరిచి
తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేయించే "బద్ధకం" చేతిలో.....

ఓటమి నుండి "స్పూర్తి" పొందాల్సిన ఆలోచనను,
నా వల్లేం అవుతుంది అనిపించే "నిరాశ" చేతిలో.....
నమ్మకంగా ఉండగలిగిన మన "సంస్కారాన్ని",
బలహీనపరిచి తను బలం పొందే "అనుమానం" చేతిలో....
నింగి విరిగి మీద పడ్డా నిబ్బరంగా ఉండగలిగే మన "ధైర్యాన్ని",
చిన్న దెబ్బకే దాసోహం అనిపించే "పిరికితనం" చేతిలో.....
ఎలాగయినా గెలవాలి అనే మొక్కవోని మన "పట్టుదలని",
మధ్యలోనే నడ్డి విరిచే "నిర్లక్ష్యం" చేతిలో....
ప్రపంచాన్ని గెలవగలిగే అమూల్యమయిన "ప్రేమ"ని,
పక్కకు నెట్టి మనని పక్కదోవ పట్టించే "ద్వేషం" చేతిలో....
ఓడిపోదాం........రండి....!
-శతఘ్ని..!!
Source : ఇట్లు మీ శతఘ్ని

0 comments :
Post a Comment