అన్నీ ఆధీనంలోనే ఉన్నాయి అనుకునే అమాయకపు " అప్రమత్తత "వి నువ్వు ...

అన్నీ ఆధీనంలోనే ఉన్నాయి
అనుకునే అమాయకపు " అప్రమత్తత "వి నువ్వు ...
నిన్ను బెదరగొట్టాలనుకునే
అనాలోచితావేశపు " హెచ్చరిక "ని నేను ..
తరాల తరబడి సా ............ గే ధారావాహిక తాలూకు
నిత్య " తరువాయి భాగానివి " నువ్వు ...
సమయం సందర్భం లేకుండా వచ్చే
వాణిజ్య ప్రసారాన్ని నేను ..
ఇద్దరికి ఇద్దరం సరిపోయాం అని
ఇద్దరి అహాలు ఎప్పుడో సంతృప్తి పడ్డాయిగా?
ఇంకా ఈ గొప్పలు ఎంచే గోల దేనికోయ్ సుబ్బారావ్??
- శతఘ్ని ...!!
Source : ఇట్లు మీ శతఘ్ని 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment