లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి.. ఎప్పటికప్పుడు quality of life మెరుగుపడాలి.

ప్రతీ ఒక్కరూ చదవాల్సింది..
________________
లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి.. ఎప్పటికప్పుడు quality of life మెరుగుపడాలి.
మనలో చాలామందికి "ఒక విధంగా" బ్రతకడం మాత్రమే తెలుసు.. అలవాటైపోయింది. అంతకన్నా భిన్నంగా ఆలోచించం.. భిన్నంగా బిహేవ్ చెయ్యం.. మన ఏటిట్యూడ్ మార్చుకోం..
ఎప్పుడైతే లైఫ్‌లో నేర్చుకోవడం ఆగిపోతుందో అప్పటితో లైఫ్ ముగిసిపోయినట్లే. ఫిజికల్‌గా మనం ఏక్టివ్‌గానే ఉండొచ్చు.. కానీ మెంటల్‌గా ఎవరూ మన పాత ఆలోచనలూ, అభిప్రాయాలూ, half boiled వ్యక్తిత్వాన్ని తట్టుకోలేరు.
ఏం చేస్తావో అది చేయి.. ఏరోజుకారోజు నువ్వు కొత్తగా కన్పించాలి.. ప్రపంచం సంగతి పక్కనపెట్టు.. ఫస్ట్ నీకు నువ్వు నిన్నటి కన్నా కొత్తగా అన్పించాలి. శిల్పాల్ని చెక్కే శిల్పుల్ని ఎప్పుడైనా గమనించే ఉంటారు. వాళ్లు రాత్రికి రాత్రి శిల్పం తయారు చెయ్యలేరు. రోజూ కొంత షేప్ తీసుకొస్తూ ఉంటారు. చివరకు అద్భుతమైన శిల్పం మనకు కన్పిస్తుంది. మనమూ అంతే ఎలా చెక్కుతారో, ఎప్పుడు చెక్కుతారో, ఏ మెధడ్స్ పాటిస్తారో మీ ఇష్టం.. కానీ మీరు ఓ గొప్ప శిల్పంలా తయారవ్వాలి.
చాలామందికి లైఫ్‌లో "సక్సెస్" ఒక్కటే పెద్ద పారామీటర్. కానీ వ్యక్తిగతంగా సక్సెస్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఫస్ట్ "నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి" - ఇదే ఆలోచన నా జీవితాంతం. అలా తీర్చిదిద్దుకునే క్రమంలోనే నాకు సక్సెస్ ఓ by productగా వచ్చింది.. నన్ను నేను తీర్చిదిద్దుకునే క్రమంలో అలాంటి by products చాలానే వచ్చాయి. నా వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతూ నన్ను ప్రాణంగా భావించే ఆత్మీయులూ etc.
సక్సెస్ గురించో ఇంకో దాని గురించి ఆలోచించడం మానేయండి.. ఓ complete manగా, ఆలోచనల్లోనూ, నడవడికలోనూ, జీవిత గమ్యంలోనూ transform అయితే చాలు. Complete man అంటే గంభీరంగా ఉండడం కాదు... చాలామంది గంభీరంగా ఉంటూ, body language poserలతో హుందాగా ప్రవర్తిస్తుంటారు. కంప్లీట్ మెన్ చాలా స్టుపిడ్‌గానూ బిహేవ్ చెయ్యగలుగుతాడు, చాలా ఛైల్డిష్‌గానూ బిహేవ్ చెయ్యగలుగుతాడు, అతని మాటలు చాలా సిల్లీగానూ ఉంటాయి, అలాగే తలలు బద్ధలు కొట్టుకున్నా అర్థం కానంత లోతుగానూ ఉంటాయి. ఇదే ఫ్లెక్సిబులిటీ, beauty of life. ఎలాగైనా ఉండగలగాలి, కానీ గమ్యం మర్చిపోకూడదు.
ఇకపోతే మనుషుల్ని సంపాదించుకోవడానికి చాలామంది నానా తంటాలు పడుతుంటారు. అంత కష్టం అవసరం లేదు. మీరు నిజాయితీగా, మీ పని మీరు బుద్ధిగా చేసుకుంటూ ఉండండి.. మీలో విషయం ఉందనిపిస్తే మనుషులు ఆటోమేటిక్‌గా వస్తారు. మీ నేచర్ తప్పించి మీరు మనుషుల కోసం వేసే ఏ పిచ్చి స్ట్రేటజీలూ మనుషుల్ని సంపాదించి పెట్టలేవు. నావరకూ కొన్నేళ్ల క్రితం వరకూ నాకున్న సర్కిల్ వేరు. ఇప్పుడున్న సర్కిల్ పరిధి వేరు. రేపు ఇంకో పెద్ద వలయం క్రియేట్ అవుతుంది. నేను ప్రత్యేకంగా చేసిందంటూ ఏం లేదు. నా పనేదో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుని నాకు నేను బుద్ధిగా చేసుకుంటూ పోవడమే.
మనుషులు పనుల్ని బాగా అర్థం చేసుకుంటారు. పని చేసే వాళ్లని బాగా అర్థం చేసుకుంటారు. మాటలు చెప్పే వాళ్లనీ, మాటలతో దగ్గరవ్వాలని చూసే వాళ్లనీ ఎవరూ ఎంటర్‌టైన్ చెయ్యరు. ఎవరు స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారో, ఎవరు నిజాయితీపరులో చిన్న పిల్లలు కూడా మనిషిని చూడగానే ఇట్టే చెప్పేయగలుగుతారు. అందుకే కబుర్లు మానేయండి.. పని చేయండి. మీలో మీరు చూసుకోండి.. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. అన్నీ ఆటోమేటిక్‌గా అవే వస్తాయి.
Source : Sridhar Nallamothu
- నల్లమోతు శ్రీధర్
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment